ఓట‌మిని ఓడిద్దాం.. మీరు సిద్ధ‌మేగా!

గెలిస్తే ఏముందిరా.. ప్ర‌పంచం నిన్ను గుర్తిస్తుంది.. ఒక్క‌సారి ఓడిచూడు ప్ర‌పంచ‌మంటే ఏమిటో తెలుస్తుంది.. పిల్ల‌జ‌మిందార్ సినిమాలో రావుర‌మేష్ హీరో నానితో చెప్పిన మాట‌లు.. ఇప్ప‌టి ప‌రిస్థితికి అన్వ‌యించుకుందాం. ఓట‌మి అంటే అంద‌రూ భ‌య‌ప‌డ‌తారు. చిన్న‌పాటి దెబ్బ‌త‌గిలితే విల‌విల్లాడే ఒక సున్నిత‌మైన ఆడ‌పిల్ల‌.. పెళ్ల‌యి.. ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చేముందు పురిటినొప్పుల‌ను ఎలా భ‌రిస్తుంద‌నే ప్ర‌శ్న వేసుకుంటే స‌మాధానం దొరుకుతుంది. ఏదైనా సాధించాలంటే ఎన్నో స‌వాళ్ల‌ను చ‌విచూడాలి. విజ‌యం కాళ్ల‌ముందుకు రాదు.. దాన్ని సాధించుకునేందుకు ఎన్ని వేల అడుగులు వేయాల‌నేది విజేత‌ల‌కు మాత్ర‌మే తెలిసే వాస్త‌వం.

ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా, టి.వి. పెట్టినా, వార్తా పత్రిక చదివినా, సమాజంలో ప్రతి ఒక్కరిలో నాటుకుపోయిన మాట కరోన. గతంలో ఎబోలా, సారా ఇంకా అనేక వైరస్ లతో పోల్చి చూస్తే కరోన అత్యంత ప్రమాదకారి. దీనివల్ల ప్రతి ఒక్కరిలో ఒక తెలియని భయం. వ్యాధి సోకి కొందరు ప్రాణాలు విడిస్తే వారి కుటుంబ సభ్యులది ఒక బాధ, వారికి పొరుగునున్న వారు కావొచ్చు, వారితో వ్యాపార సంబంధాలు కలిగివున్న వారు మరికొందరు మానసికంగా బాధపడితున్నారు.విద్యార్థులు, చిన్న పెద్ద వ్యాపారులు, ఉద్యోగులు,చేతి వృత్తి దారులు మొదలుకొని ప్రతి ఒక్కరు ఈ వైరస్ కి ప్రభావితమయినవారే.
ఎవరిని పలుకరించినా నిరాశ, నిర్లిప్తత, అభద్రత తోనే ఉన్నారు.
సమాజవ్యాప్తి (communicable diseases) చెందే వ్యాధలగురించి భయపడే రుగ్మతనను Nosophobia అంటారు. కొన్ని ఫోబియాల వల్ల Depression, Anxiety, Bipolar Disorder, Schizophrenia, Mental Unrest , Sleepless
వంటి మాన‌సిక రుగ్మతలు కొందరిలో సహజం. తదనుగుణంగా చేసే పనిలో అనాసక్తత చూపడం, అసలు చేసే పనిని వదిలివేయడం, తార్కికంగా ఆలోచించ లేకపోవడం, విసుగు, కోపం, విపరీతంగా ధూమపానం, మద్యపానం చేయడం వంటి లక్షణాలు వ్యక్తులను బట్టి వేర్వేరుగా ఉంటాయి.. ఇవన్నీ వ్యక్తి యొక్క శారీరిక మానసిక పరిస్థితుల్లో ఏర్పడే ప్రభావం. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే సుమా!
ఇక రెండోవైపు చూసినట్లయితే కరోన వల్ల 2020 మార్చి 21 నుండి శుభ కార్యక్రమాలు లేవు, వున్నా నిరాడంబరంగా జరగడం, దీనివల్ల వస్తువుల కొనుగోలు లేక వ్యాపారస్తులు, కొన్ని కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించుట, దూర ప్రయాణాలు లేకపోవడం వెరసి వస్తు సేవల డిమాండ్ లేకపోవడం, డిమాండ్ ఎప్పుడయితే లేదో,వ్ ఉత్పత్తి తగ్గి కార్మికులకు ఉద్యోగులకు వేతనాలు లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది…ఇదంతా ఆర్ధిక వలయం. ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలు, సమాజంలో ఎంతమందికి లబ్ది చేకూరిందో అందరికి విదితమే..అంతమెపుడో తెలియని ఈ వైపరీత్యం నుండి ఎలా బయట పడేది…

ముందు ప్రతి ఒక్కరు మాన‌సిక స్టయిర్యం అల‌వ‌ర‌చుకోవాలి.

దేశంలో 132 కోట్ల ప్రజానీకం బ్రతుకుతుంటే నేనొక్కడినే బ్రతకాలేనా అనే ప్రశ్న వేసుకోవాలి

శ్రమ చేయడంలో గౌరవం ( dignity of labour )ఉండాలి…ఏ పని అయితేనేమి చేసి రూపాయి సంపాదించగలగాలి అనే పట్టుదల ఉంటే, ఏ పని చేయడానికైనా వెనుకాడరు. ఈ రకమైన పట్టుదల పెరగాలి. ఇటువంటి న్యూనతా భావం ( Inferior Complex) నుండి బయటపడాలి.

ఆత్మ ద్వేషం ( Self- hatred) ఉండకూడదు. అంటే ఒక వ్యక్తి తాను సాంఘికంగా, ఆర్ధికంగా బలహీనమైన సమూహంలో ఉన్నందుకు బాధపడటం. ఇటువంటి భావనను దరిచేరనీయకూడదు.

చీకటి తరువాత వెలుగు తప్పనిసరిగా వస్తుందని ఆశ మనిషిలో ఉంటే మనుగడ అంత కష్టమేమీ కాదు. “వ్యాపారం బాగున్నప్పుడు మనమే సంపాదించాము, ఇప్పుడు లేదు, పరిస్థితులు బాగు పడేదాక వేచిచూద్దాం” అనే భావన వ్యాపారుల్లో పెంపొందించుకోవాలి.

ఒక సంస్థ యజమాని కూలీ గా మారి తిరిగి తిరుగులేని వ్యాపారవేత్తగా మారిన వారున్నారు..ఉదాహరణకు కె.ఎఫ్.సి. పరిస్థితులు ఏవైనా కావొచ్చు…అనుకూలించేదాక వేచియుండక తప్పదు..

మనకున్న శక్తి సామర్ధ్యాలు ఏమిటి, మనం ఏ రంగంలో ఏ పని చేయగలం అనే స్వీయ అంచనా( self- assessment ) చేసుకొని ఆ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. వనరులు పరిమితం, సృజనాత్మకత అపరిమితం. ఉన్న వనరులను ఉపయోగించుకొని లేదా సృష్టించుకొని, సృజనాత్మకతను జోడించినట్లయితే మీరే విజేతలు. అయితే ఇది అంత సులువు కాదు అలాగని అంత కష్టమూ కాదు..

విద్యార్థులు సమయం వృధా కాకుండా కొత్త కోర్సులు, కళలు నేర్చుకోవడం ప్రారంభించాలి…

ప్రభుత్వం, డాక్టర్లు, నర్సులు, శాస్త్రవేత్తలు నిరంతరం కరోన పై యుద్ధం చేస్తున్నారు. వారిచ్చే సలహాలను పాటిద్దాం. బాధ్యతగా మెలుగుదాం.

కరోన చాలా పాఠాలు నేర్పుతుంది..భవిషత్తులో ఇటువంటి అనియంత్రిత పరిస్థితి ( uncontrollable situation ) వచ్చినా కూడా ఎలా తట్టుకోవాలో మనలో ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి…. పరిస్తితులన్నీ కుదుటపడి కోవిడ్ కు ముందు జీవితం ఎలా వుందో అలా సాగాలని కోరుకుంటూ…
సర్వేజన శుఖినోభావంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here