దేవుడంటే నల్లరాతిలో కాదోయ్.. మనిషేనోయ్.. ఆంధ్రా బోధిధర్మ ఆనందయ్యను ప్రోత్సహిద్దాం..

ప్రపంచం ముచ్చటపడేట్టుగా.. సందర్భానుసారం …
ఒక్కో వ్యక్తి ఒక్కోసారి తళుక్కున మెరుస్తాడు.

ఆంధ్రా బోధిధర్ముడు బొనిగే ఆనందయ్యలా..

ఆయన నేనే గొప్ప. అందరూ నా దగ్గరకే వచ్చి రోగం తగ్గించుకోమనడంలేదు. ఇంటినుంచే ఆరోగ్యాన్ని కాపాడుకోమంటున్నాడు. వంటగదిలో పోపుల డబ్బా వదిలి.. ఆస్పత్రికెళ్లి ప్రాణాలు విడవొద్దని చెబుతున్నాడు. భారతీయ ఆయుర్వేద గొప్పతనాన్ని చాటి ఊపిరిపోస్తున్నాడు.

కార్పొరేట్ కోటుతో కర్కశ వైద్యవ్యాపారం చేస్తూ కోట్లు పోగేసుకుంటున్న అభినవ యమకింకరులకు చెప్పుతో బుద్ధి చెప్పినట్లుగా..

ఆనందయ్య …మనిషి రూపంలో దేవుడై నిలిచాడు.

కపటనాటకాలతో కోటానుకోట్లు అక్రమార్జన చేసే బాబాలు, స్వాముల కాళ్లమీద బొక్కబోర్లా పడుతుంటారు కదా మన పాలకులు.

మరి, అంతటి మహిమాన్విత బాబాలు, స్వాములు కరోనా విరుగుడుకు కిక్కురుమనలేదే..
భయంతో ఊపిరొదులుతున్న భక్తజనానికి భరోసానివ్వలేకపోయారే..

రాళ్లుగా నిలబడ్డ దేవుళ్లంటే నాకెంతో నమ్మకం. కష్టాలు గట్టెక్కించడానికి మనిషిరూపంలో సాక్షాత్కరిస్తారని..

“అనుభవం, పరిశీలన, నమ్మకం.. ”
ప్రాణం నిలవడానికి ఈ మూడింటికన్నా అనుమతులు కావాలా..??

సరే, శంకులో పోస్తేనే తీర్థం అనుకుంటే… అదేదో త్వరగా పోయండి.

పాలకులారా…సనాతన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించి..ప్రజల ప్రాణాలను నిలబెట్టండి.

– పోనా
(పోగర్తి నాగేశ్వరరావు), జర్నలిస్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here