బండికి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం.. తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కోస‌మే యాత్ర చేప‌ట్టారా!!

తెలంగాణ‌లో బీజేపీకు బ‌లం ఉందా! అస్స‌లు జ‌నం కేసీఆర్‌ను కాద‌ని కాషాయ‌జెండా వైపు చూస్తారా! అని సందేహం ఉన్న వారికి బీజేపీ తెలంగాణ అధినేత బండి సంజ‌య్‌కుమార్‌కు మ‌హాసంగ్రామ యాత్ర‌కు వ‌స్తున్న జ‌నాన్ని చూసి నోళ్లు మూసుకుంటున్నారంటోంది కాషాయ అభిమానం. కొద్దిరోజుల క్రితం బండి సంజ‌య్ పాత‌బ‌స్తీ బాగ్య‌ల‌క్ష్మి దేవాల‌యం నుంచి మోగించిన శంఖారావం యావ‌త్ తెలంగాణా మారుమోగుతోంది. న‌గ‌రంలో అడుగ‌డుగునా జ‌నం ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థం బీజేపీ నేత‌ల‌కూ షాక్‌కు గురిచేస్తుంది. ఇంత‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. సంజ‌య్ కూడా చాలా సంయమ‌నంతో మాట్లాడుతూ ముందుకు సాగ‌టం ప‌రిణితికి నిద‌ర్శ‌నం. కేవ‌లం స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ 2023 నాటి ఎన్నిక‌ల‌కు తామే రాష్ట్రానికి ప్ర‌త్యామ్నాయం అనే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లో రేకెత్తించ‌టంలో స‌క్సెస్ అయ్యారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్ వంటి చోట్ల ఇంత‌టి స్పంద‌న రావ‌టం.. పైగా ఇత‌ర పార్టీ ల‌నుంచి చేరేవారి సంఖ్య కూడా పెర‌గ‌టం కాషాయ‌నేత‌ల్లో ఉత్సాహం పెంచుతోంది. ఇదే ఊపులో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా ఈట‌ల గెలుపు ఖాయ‌మంటున్నారు. అయితే.. ఇప్పుడే యాత్ర‌ను ప్రారంభించ‌టానికి కార‌ణం.. తెలంగాణ‌లో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే ఊహాగానాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here