జ‌న‌సేనానికి పెరిగిన క్రేజ్‌.. ఊహించ‌ని రీతిలో జ‌న‌సేన గ్రాఫ్‌!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే గుండెల నిండా ప్రేమ ఉంది.. కానీ వైసీసీకు ఓటేస్తారు అదే బాధేస్తుంటుంది.. కార్య‌క‌ర్త‌ల మీటింగ్‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌లు. నిజ‌మే.. బీమ‌వ‌రం, గాజువాక రెండుచోట్ల ఓట‌మి ఎవ‌రైనా అయితే రాజ‌కీయాలు వ‌దిలేసి వెళ్లిపోతారు. లేక‌పోతే కొద్దికాలం జ‌నాల్లోకి రాకుండా ఉంటారు.. కానీ ప‌వ‌న్ అలా కాదు.. ఓడిన మ‌రుస‌టిరోజే జ‌నాల్లోకి వ‌చ్చాడు. అలా రావాలంటే ఎన్నో గ‌ట్స్ ఉండాలి.. ఎంతో దైర్యం ఉండాలి.. అదే అస‌లైన నాయ‌కుడి ల‌క్ష‌ణం.. ఇదీ రాజ‌కీయ ఉద్దండుడు ఉండ‌వ‌ల్లి చేసిన ప్ర‌శంస‌. ఓడినా జ‌నం మ‌ధ్య ఉండ‌ట‌మే త‌న ఎజెండా అని చెప్ప‌ట‌మే కాదు.. దాన్ని వాస్త‌వ‌రూపంలో నిరూపించిచూపుతున్నాడు సేనాని. శ్రీకాకుళం నుంచి క‌డప వ‌ర‌కూ ఇటీవ‌ల రోడ్ల దుస్థితిపై ఆయ‌న ఇచ్చిన పిలుపుతో ఏకంగా కోటి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఒక రోడ్డు స‌రిగాలేక‌పోతే ఎన్ని కుటుంబాలు దెబ్బ‌తింటాయ‌నేది ప్ర‌త్య‌క్షంగా చూపారు. దీనిపై వైసీపీ కూడా త‌ప్పులు
స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేసింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మీటింగ్ పెట్టి మ‌రీ అధికారుల‌కు క్లాసు పీకార‌ట‌. అక్టోబ‌రు త‌రువాత రోడ్ల‌న్నీ మ‌ర‌మ్మ‌త్తులు చేయించాల‌ని ఆదేశించారు. ఈ ఒక్క విజ‌యం జ‌న‌సేన‌కు జ‌నాల్లో విప‌రీత‌మైన క్రేజ్ తీసుకొచ్చింది. నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న జ‌న‌సేన గ్రాఫ్ అమాంతం పెరిగిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రో రెండేళ్లు ఇదే స్పీడు.. జ‌నంలో ఇదే అభిప్రాయం ఉంచ‌గ‌లిగితే జ‌న‌సేన‌కు తిరుగు ఉండ‌ద‌నేది కూడా అంటున్నార‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here