డాక్టర్ అల్తాఫ్ హస్సన్ – రామస్వామి
1st వైఫ్ శాంతి రావు- జయప్రద
2nd లావణ్య రెడ్డి – సుధా
3rd సాత్విక జై – సిరి
కమెడియన్స్ – భద్రం , ధన్ రాజ్
డైరెక్టర్ : రామ్ నారాయణ్
ప్రొడ్యూసర్ : సతీష్ కుమార్ & రామకృష్ణ వీరపనేని
బట్టల రామస్వామి బయోపిక్.. టైటిల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు, మహానటి సావిత్రి, జయలలిత వంటి గొప్ప నటులు, ధోని, మిథాలీరాజ్, గోపిచంద్ వంటి క్రీడాకారుల జీవితచరిత్రలు మాత్రమే వెండితెరపై బయోపిక్‌లుగా వచ్చాయి. తొలిసారిగా.. సామాన్యుడి జీవిత కథను.. ఫిక్షన్ రూపంలో తెరకెక్కించారు. బట్టలమ్ముకుంటూ తిరిగే సాధారణ వ్యాపారి.. లక్ష్యం బట్టలకొట్టు పెట్టాలనేది. కానీ .. ఆ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు.. అనుభవాలను చక్కగా పలికించారు హీరో డాక్టర్ అల్తాఫ్ హస్సన్. హారోయిన్లు కూడా పాత్రల్లో ఒదిగిపోయారు. 1980లో పరిస్థితులు.. పల్లె వాతావరణాన్ని డైరెక్టర్ రామ్ నారాయణ్ అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా చూస్తున్నపుడు.. అప్పట్లో దర్శకుడు వంశీ తీసిన లేడీస్‌టైలర్ గుర్తుకు వస్తుంది. ఇక కథలోకి వెళితే..
హీరో చాలా అమాయకుడు.. నిజంగానే అల్తాఫ్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. హీరోకి బట్టల షాప్ పెట్టాలని కోరిక. తండ్రి అంతిమయాత్రలో చూసిన అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు . అత్తా మామలు రెండో కూతురుని ఒక డ్రామా ఆడి హీరో కె రెండో భార్యగా అంతకడతారు. రెండవ భార్య పిచ్చిది అండ్ శోభనరోజు తెలుస్తూది. బట్టలమ్మటానికి పక్క వూరికి వెళ్లి నప్పవుడు ఒక తల్లి, కూతురు నాటకీయంగా ఆ కూతుర్ని ఇచ్చి పెళ్ళేసి చేస్తారు మూడు పెళ్లిళ్లతో మూడిళ్ల పూజారిగా మారతాడు హీరో. మొదటి, మూడో భార్య మధ్య తలెత్తే గొడవలు హీరోకు చికాకును తెప్పిస్తుంటాయి. ప్రేక్షకులకు నవ్వులు కురిపిస్తాయి. సినిమా కొత్త ప్రయోగంగా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ కాస్త ఇబ్బందిగానూ కనిపిస్తుంది. దర్శకుడు కథనంపై కొద్దిగా దృష్టి పెట్టినట్టయితే సినిమా మరింతగా ఆకట్టుకునేదేమో అనిపించింది. కరోనా లాక్‌డౌన్ వేళ ఇంటిల్లిపాదీ హాయిగా కూర్చుని చూడాల్సిన అని సినిమా అని మాత్రం చెప్పవచ్చు.
కామెడీ : భద్రం భార్య భర్తల కామెడీ & భద్రం దొంగ బాబాగా ధన్‌రాజ్ తో చేసే కామెడీ భద్రం టైమింగ్ హైలైట్.
కామెడీ కావాల్సినంత ఉంటుంది
హీరోగా అల్తాఫ్ నటన అదుర్స్.
కెమెరా వర్క్ చాలా బాగుంది, పల్లెటూరిని బాగా చూపించారు గ్రామీణ వాతావరణం ఉట్టి పడుతుంది
పాటలు కూడా బావున్నాయి
Rating : 3/5
మైనస్ పాంట్ : స్క్రీన్ ప్లే కాస్త సాగదీత గా అనిపించింది.
ఎక్కువ మంది కొత్తవాళ్లు ఉండటం
జీ 5 OTT లో రిలీజ్ అయ్యింది



