సామాజిక మాధ్యమాల ద్వారా మైనర్ అమ్మాయిలను, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. లైంగిక వాంఛలు తీర్చుకుంటోన్న మోస్ట్ డెంజరస్ సైకో అఖిల్ ను అరెస్ట్ చేశారు నల్లగొండడ షీ-టీమ్ పోలీసులు. గత రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియాలో యువతులను, మహిళలని లైంగికంగా వేధించి సెక్సువల్ కోరికలు తీర్చుకుంటున్నన్నట్లు విచారణలో వెల్లడించినట్లు నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితుడు అఖిల్ ఉచ్చులో పదుల సంఖ్యల పలువురు యువతులు, మహిళలు ఉన్నట్లు తేలడం గమనార్హం. సికింద్రాబాద్ లోని ఓ హోమ్ కేర్ సెంటర్ లోవార్డు బాయ్ గా పనిచేస్తూ.. నర్సులను బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు వెల్లడించారని అన్నారు. అలాగే.. నగ్నంగా ఉంటూ మహిళలకు, యువతులకు వీడియో కాల్ చేయడం.. వారు కాల్ లిఫ్ట్ చేయగానే రికార్డ్ చేయడం.. ఆ వీడియో రికార్డులు, స్క్రీన్ షాట్ లతో సదరు బాధితులను బ్లాక్ మెయిల్, లైంగికంగా వేధింపులు చేయడం ఒక అలవాటుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ డేటింగ్ లకు, జల్సాలకు అలవాటుపడి.. అసాంఘీక కార్యకలాపాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు అఖిల్ మీద.. జనాగామ, సికింద్రాబాద్ లోని తుకారాంగేటు, నల్లగొండ పీఎస్ లలో కేసులు నమోదుకాగా.. ఎన్నో పెడింగ్ కేసులు సైతం ఉన్నట్లు సమాచారం. మొత్తం రెండు వందల మంది అమ్మాయిల కాల్ లిస్ట్ ఉండగా.. వారిలో 30మంది వరకు బాధితులుగా గుర్తించామని ఎస్పీ ఏవీ రంగనాధ్ అన్నారు. ఓ భాధితురాలి పిర్యాదుతో అఖిల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామనీ.. కౌమార దశలో ఉన్న అమ్మాయిల పట్ల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని.. బాధిత యువతులకు అండగా.. కేసులతో ఇబ్బంది లేకుండా షీ టీమ్ తో భరోసా ఇస్తుందని ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలపారు.



