‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ఆవిష్కరణతో కొత్త సంవత్సరాన్ని తీసుకొచ్చిన బ్లూ డార్ట్

 

అంతర్జాతీయ షిప్‌మెంట్స్‌పై ఏప్రిల్ 02, 2022 వరకు ఈ ఆఫర్‌ చెల్లుబాటులో ఉంటుంది

మార్చి 22, 2022: భారతదేశపు ప్రముఖ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్‌ పోస్ట్ DHL గ్రూప్‌లో భాగమైన బ్లూ డార్ట్ కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ ప్రియమైన వారికి నూతన సంవత్సరపు ఆనందాన్ని, ఆప్యాయతను బహుమతులు, స్వీట్లు, మరెన్నో ఇతర రూపాల్లో పంపించేందుకు ఉగాది ఎక్స్‌ప్రెస్‌ వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలకు చేరుకునేలా ఉగాది ఎక్స్‌ప్రెస్ అత్యున్నతమైన, విశ్వసనీయమైన సేవలను తగ్గింపు ధరలకు అందిస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా కస్టమర్లు 5 కిలోల బరువున్న అంతర్జాతీయ షిప్‌మెంట్స్‌పై 40% తగ్గింపు, 10 కిలోల నుంచి 20 కిలోల మధ్య బరువుండే అంతర్జాతీయ షిప్‌మెంట్స్‌పై 50% తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 02, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
కస్టమర్లకు అత్యున్నత అనుభూతి అందించేందుకు బ్లూడార్ట్‌ ఎప్పుడూ దృష్టి సారిస్తుంది కాబట్టి పోటీ వాతావరణంలో దానిని వేరుగా నిలబెడుతుంది. కస్టమర్ల నాడిని పట్టుకొని వారికి అవసరం ఏర్పడకముందే సంబంధిత సేవలు ప్రవేశపెడుతూ ఈ బ్రాండ్‌ విజయవంతంగా నిలుస్తోంది.
బ్లూ డార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు మహమ్మారిని ‘స్థానికమైనది’ అని సంబోధించడానికి, అంగీకరించడానికి ఆసక్తిగా ఉన్నారు. అయినప్పటికీ ఆ అంటువ్యాధి భయం మాత్రం వీడటం లేదు. కొత్త సంవత్సరం వేళ ప్రియమైనవారి సమక్షంలో ఉండటం, బహుమతులు, స్వీట్లు, మరెన్నో అందుకోవడం పండగ స్ఫూర్తి నింపేందుకు అవసరం. మహమ్మారి భయం కారణంగా మా కస్టమర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి విశ్వసనీయమైన, ప్రతిస్పందనతో కూడిన పరిష్కారాన్ని అందించేందుకు మేము ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ప్రారంభించాం. మా కస్టమర్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి ప్రియమైన వారి సాన్నిహిత్యాన్ని, చేయూతను అందుకునేందుకు అర్హులు. మహమ్మారి దూరాలను పెంచినప్పటికీ బ్లూ డార్ట్ తన కస్టమర్లకు వారి సరుకులను ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్లడం, అందజేయడం ద్వారా ప్రపంచం ఒక చిన్న ప్రదేశంగా కొనసాగేలా చూసేందుకు కృషి చేస్తుంది.
ఎల్లప్పుడూ కస్టమర్-కేంద్రీకృతంగా ఉంటూ భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే సాంకేతిక పరిష్కారాలను నిరంతరం మెరుగుపరుస్తూ పనిచేసే సంస్థ బ్లూ డార్ట్. సాంకేతిక సామర్ధ్యం, సమ్మిళిత తత్వం, ప్రజల సంస్కృతితో పాటు ప్రతి స్థాయిలోనూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించడం బ్రాండ్‌ మార్కెట్‌ నాయకత్వానికి నిదర్శనం. బిల్లింగ్, కలెక్షన్‌, చెల్లింపు సహ మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసిన కాంటాక్ట్ లెస్ డెలివరీ ఫీచర్‌ ద్వారా కస్టమర్లు నిరంతరాయమైన లాజిస్టిక్స్ అనుభూతి పొందవచ్చు. కస్టమర్లకు ఎంచుకునేందుకు 16 డిజిటల్ వాలెట్‌లు, QR కోడ్, UPI ఇంటర్‌ఫేస్ (BHIM), క్రెడిట్ & డెబిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌ సహా అనేక రకాల చెల్లింపు విధానాలు అందుబాటులో ఉన్నాయి. యాపిల్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేలో అందుబాటులో ఉన్న ‘My Blue Dart’ యాప్ ద్వారా కస్టమర్లు వారి ప్యాకేజీని ట్రాక్ చేసుకోవచ్చు. వేర్వేరు ప్రాంతాలకు షిప్‌మెంట్స్‌ పంపించేందుకు అత్యంత తక్కువ ఖరీదైన విధానాన్ని కనుగొనవచ్చు. అలాగే ముఖ్యమైన సంప్రదింపు సమాచారాన్నిఅత్యంత యూజర్‌ ఫ్రెండ్లీ విధానంలో యాక్సెస్‌ చేసుకోవచ్చు.
www.bluedart.comలో సమీప బ్లూ డార్ట్ కౌంటర్‌ కనుగొనండి
బ్లూ డార్ట్ సేవలు పొందేందుకు లేదా ఏవైనా తదుపరి విచారణల కోసం కస్టమర్లు కింది కస్టమర్ కేర్ నంబర్ – 1860 233 1234కు కాల్ చేయవచ్చు లేదా customerservice@bluedart.comలో మాకు ఈమెయిల్ చేయవచ్చు.

About Blue Dart:
Blue Dart Express Ltd., South Asia’s premier express air and integrated transportation & distribution company, offers secure and reliable delivery of consignments to over 35,000 locations in India. As part of Deutsche Post DHL Group’s DHL eCommerce Solutions division, Blue Dart accesses the largest and most comprehensive express and logistics network worldwide, covering over 220 countries and territories, and offers an entire spectrum of distribution services including air express, freight forwarding, supply chain solutions, customs clearance etc.

The Blue Dart team drives market leadership through its motivated people, dedicated air and ground capacity, cutting-edge technology, wide range of innovative, vertical specific products and value-added services to deliver unmatched standards of service quality to its customers. Blue Dart’s market leadership is further validated by its position as the nation’s most innovative and awarded express logistics company for exhibiting reliability, superior brand experience and sustainability which include recognition as one of ‘India’s Best Companies to Work For’ by The Great Place to Work® Institute, India, ranked amongst ‘Best Multinational Workplaces in Asia’ by The Great Place to Work® Institute, Asia, voted a ‘Superbrand’ and ‘Reader’s Digest Most Trusted Brand’, listed as one of Fortune 500’s ‘India’s Largest Corporations’ and Forbes ‘India’s Super 50 Companies’ to name a few.

Blue Dart fulfils its social responsibility of climate protection (GoGreen), disaster management (GoHelp) and education (GoTeach) through programs.

 

Previous articleప్రముఖ రైటర్, డైరెక్టర్  విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్,హీరో సంపూర్ణేష్ బాబు, రాకేష్ మాస్టర్,ల చేతులమీ దుగా ఘనంగా ప్రారంభమైన “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్”.
Next articleలక్షలాది సామాన్య ప్రజలకు జీవిత భాగస్వామి ఎంపికలో సాయపడడం కోసం జోడీ యాప్ ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here