ఎవరికైనా కష్టాలు వెంటాడుతుంటే.. ఒరేయ్ వాడికి సినిమా కష్టాల్నా అని ఆటపట్టిస్తుంటారు. అదే సినిమావాళ్లకు కష్టాలు వస్తే..! ఔనా వాళ్లకూ ఇబ్బందులు వస్తాయా అనుకుంటున్నారా.. అయితే మీరు ఇది చదవాల్సిందే. ఇద్దరూ వెండితెరపై మాస్ హీరోలు. బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించగల హీరోలు. కానీ ఇప్పుడు వారికీ కొత్త కష్టాలు వెంటాడుతున్నాయట. ఒకరికి దర్శకుడు దొరకటం కష్టమైతే.. మరొకరికి హీరోయిన్ ఎవరా అనేది అంతుబట్టకుండా ఉందట. అదెలా అంటారా.. చిరంజీవి ఆచార్య.. కొరటాల దర్శకత్వంలో దాదాపు పూర్తవుతుంది అనుకున్నారు. కానీ.. కరోనా తో అప్‌సెట్ అయింది. ఆ తరువాత.. ఈ కథ నాదంటూ మరో పాత్ర ప్రవేశం. ఇంతలోనే చిరుకి కరోనా అంటూ నిలిపివేశారు. పోన్లే.. అనుకుని ఎట్టకేలకు సినిమా పట్టాలపైకి ఎక్కించారు. లూసిఫర్ రీమేక్ కోసం చిరు చాలా ఎగ్జయిట్‌గా ఉన్నారట. అయితే దానికి మొదట సుజిత్ అనుకున్నారు. అంతా తయారైన తరువాత తూచ్.. నువ్వొద్దంటూ మరో దర్శకుడు.. ఇలా.. ఇప్పటి వరకూ ముగ్గురు దర్శకుల చేతికి మారిందట. ఇకపోతే బాలయ్య.. వరుసగా అభిమానులను నిరాశపరస్తూ వస్తున్న బాలకృష్ణ ఈ సారి ఎలాగైనా బాక్సాఫీసు వద్ద తొడకొట్టాలని నిర్ణయించుకున్నాడట. అందుకే.. రెండు హిట్లు ఇచ్చిన బోయపాటికి బాధ్యతలు అప్పగించారట. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కొత్తగా కనిపిస్తాడంటూ ప్రచారం కూడా జరుగుతోంది. కానీ. అసలు సంగతి ఏమిటంటే.. బాలయ్యబాబు సరసన హీరోయిన్ ఎవరనేది అంతుబట్టకుండా ఉందట. సయేషా, ప్రజ్ణా జైస్వాల్, శర్మ.. ఇలా ఎవరెవరో పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఫైనల్ అయ్యారనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది.