ఒకే రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహ ఐదుగురు సీఎంలు కరోనా భారినపడ్డారు. బెంగాల్‌లో మమత బెనర్జీ కూడా కొవిడ్ భయంతో గజగజలాడుతున్నారట. అందుకే రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు తూచ్ చెబుతున్నారట. ఏపీలో సచివాలయ సిబ్బందికరోనాతో మరణించటం . అక్కడ వేలాదిగా కేసులు నమోదుకావటంతో నేతలు ఉలికిపాటుకు గురవుతున్నట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు తమను కలవద్దంట కార్యకర్తలకు ముఖాన్నేచెబుతున్నారట. మొన్న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్ననేతలు ఒక్కోకరూ కొవిడ్ పాజిటవ్‌గా తేలుతున్నారు. పవన్‌కళ్యాణ్‌తో సహ అక్కడ చాలా మంది ఉన్నారట. నాగార్జునసాగర్ ఉ ప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ ఎస్ అభ్యర్తి నోముల భరత్‌కు కొవడ్ సోకటంతో సో్మవారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైద్యపరీక్షలు చేయటంతో పాజిటివ్‌గా తేలింది ఈ లెక్కన రాబోయే రెండు మూడ్రోజుల్లో మరింత మంది బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని. డాక్టర్ ఎంవీరావు చెప్పారు. అవసరమైతే తప్ప హైదారాబాద్ ఆసుపత్రికి వచ్చే అవకాశం లేదన్నారు.