ఇదీ దెబ్బంటే.. ఎవడు కొడితే దిమ్మతిరిగి జైలు ఊచలు కనిపిస్తాయో అదే వైసీపీ అంటే… ఔనండీ బాబూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతుంది. ఎవడైనా పగతో కొడతాడు.. కసితో కొడతాడు.. వీడేంట్రా ఇలా పక్కాగా కొడుతున్నాడనేది జగన్ వ్యూహం చూసి వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయట. నిజమే.. శత్రువు బలంగా ఉన్నా.. బలపడతాడని భావించినా కొట్టే దెబ్బ ఎలా ఉండాలనేది రుచిచూపుతున్నాడు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి. ఎక్కడా చట్టాన్ని అతిక్రమించకుండా.. తమ చేతికి మట్టి అంటకుండా ప్రత్యర్థులు తమకు తామే తప్పులు చేసి బోనులో ఇరక్కునేలా వేసిన ఎత్తుగడ ఇప్పుడు టీడీపీ నేతలకు ఉరికొయ్యగా మారింది. ఒకరి తరువాత ఒకరు వైసీపీ ఎత్తులో చిక్కి విలవిల్లాడుతోంది. ఇదంతా వైసీపీ ఏకపక్ష వైఖరే కారణమన్నా… రాజకీయాల్లో క్షమాపణలు ఉండవు.. కేవలం పై చేయి సాధించటమే అనేంతగా జగన్ సర్కారు ఇప్పుడు టీడీపీలో కీలకమైన నేతలందరినీ జైలు ఊచలు లెక్కించేలా చేస్తుంది
దేవినేని ఉమా మహేశ్వరరావు.. తొలిసారిగా 2019లో మైలవరం నుంచి ఓడి.. వసంత చేతిలో పరాభవం పొందారు. అధికారంలో ఉన్నపుడు.. సాగునీటి మంత్రిగా పోలవరంలో గట్టిగానే లాభపడ్డారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర ఆరోపణలే కాదు.. ఘోరంగా విమర్శిస్తూ లక్షకోట్ల అవినీతి అంటూ ఎద్దేవాచేసిన వారిలో ఉమా తొలివరుసలో ఉంటాడు.. దేవినేనిపై వైసీపీ శ్రేణులే కాదు టీడీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు.. పలుమార్లు జైలు తప్పదని భావించినా కుదర్లేదు. ఇటీవల కొండపల్లి వద్ద మైనింగ్ పై జరిగిన రచ్చలో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆవేశం.. అనాలోచితంగా దేవినేని ఉమా తీసుకున్న దూకుడు చర్యతో కట్టడి చేసింది.. రెండేళ్లుగా చిక్కని ఉమా పలు కేసుల్లో దొరికాడు.. రాజమండ్రి జైలుకు పంపారు. మొన్న చింతమనేని.. నిన్న యరపతినేని.. ఇప్పుడు దేవినేని ఇలా.. టీడీపీలో చక్రం తిప్పుతూ.. తామే కీలకమంటూ తొడకొట్టిన నేనిల బ్యాచ్ జైలు ఊచలు లెక్క పెట్టడం .. స్టాటజీగా వైసీపీ వేస్తున్న ఎత్తుగడలకు నిలువెత్తు నిదర్శనం.