వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు ఆశలన్నీ డీ సీక్వేల్‌పై ఉన్నాయట. ప్రస్తుతం మోసగాళ్లు, సన్నాఫ్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. 2007లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు. ఆ తరువాత చాలా సినిమాలు తీసినా.. వర్కవుట్ కాలేదు. బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడ్డాయి. కొత్త ప్రయోగాలకు అవకాశం ఇచ్చినా ఎందుకో తెలుగు ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. 2013లో పాండువులు పాండువులు తుమ్మెద నుంచి ఆచారీ అమెరికా యాత్ర వరకూ వరుసగా తీసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అందుకే.. ఈ సారి శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ సీక్వెల్ ఢీ అంటే ఢీ డబుల్ డోస్ సినిమాతో రెఢీ అవుతున్నారు. దీనిలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు సినీవర్గాల సమాచారం. మరి మంచు వారి అబ్బాయి ఆశలు..ఢీ సీక్వెల్‌తో ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో చూడాల్సిందే.