రాజమౌళి.. రామ్ చరణ్.. రామారావు(జూనియర్ ఎన్టీఆర్) ఆర్ ఆర్ ఆర్గా కొత్తరూపం. కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజు కథను ఊహను జోడించి తీస్తున్న రాజమౌళి అంచనాలు భారీగా పెంచేశారు. అల్లూరి, కొమరం వీరుల కథను సరికొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియాలో ఎన్నో అంచనాలున్నాయి. బాలీవుడ్లో ఈ సినిమాకు అమీర్‌ఖాన్ కూడా పనిచేస్తున్నారట. అదేనండీ.. రెండు పాత్రలను తన స్వరంతో పరిచయం చేస్తారట. ఇకపోతే తెలుగులో ఆ బాధ్యత మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారట. రాజమౌళి అడిగిన వెంటనే చిరంజీవి కూడా ఓకే చెప్పారట. ఈ లెక్కన.. అన్నయ్య స్వరం తెలుగు తెరపై అభిమానులకు మరింత పండుగ తీసుకురాబోతుందన్నమాటే.