నెంబర్ వన్ సినిమాలో పాపులర్ డైలాగ్ స్కూల్ మూసెయ్ స్కూల్ మూసెయ్.. కోటాతో బాబూమోహన్ అనే సీన్లు భలే ఆకట్టుకుంటాయో.. ఈ సీన్ యధావిధిగా తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా జరిగింది. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తూచ్ అంటూ బాయ్‌కాట్ ప్రకటించిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. వరుస పరాజయాలతో ఇప్పటికే ఐసీయూలో ఉన్న పార్టీను కొన ఊపిరితో బతికించేందుకు నిర్ణయం తీసుకున్నాడట. అయితే.. ఇక్కడే టీడీపీ నేతలకూ బాగా మండిందట. అంతే… చంద్రబాబు ఎందుకిలా నిర్ణయం తీసుకున్నాడు. మమ్మల్ని సంప్రదించడా అంటూ పోలిట్‌బ్యూరో సభ్యులు ఎదురుదాడికి దిగారు. పార్టీ సీనియర్లు జ్యోతుల నెహ్రు, బుచ్చయ్యచౌదరి అయితే తమ జిల్లాల్లో ప్రచారం చేసుకుంటున్నారు కూడా . వాస్తవానికి జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ విషయం కోర్టు పరిధిలో ఉంది. అయినా.. కొత్త కమిషనర్ సాహ్ని రావటంతోనే ఆ ముచ్చట తీర్చేద్దామని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 2019 నుంచి వరుస ఓటమి చవిచూస్తున్న టీడీపీ ఇకమీదట ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదనుకుంటుదంట. ఇది ఒక విధంగా ఎన్నికల ఎత్తుగడే అయినా.. పార్టీ కేడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పార్టీ సీనియర్లు అంటున్నారు. వాస్తవానికి జగన్ రెండేళ్ల పాలన అంతగా ఆకట్టుకోలేదు. ప్రజల అంచనాను కూడా చేరుకోలేకపోయింది. అయినా మరో పార్టీ బలంగా లేకపోవటం. టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్ల చీలిక వైసీపీకు మరింత కలసివస్తుంది. మున్ముందు ఇదే విధంగా ఉంటే.. ప్రభావం టీడీపీ మీద బాగా పడతుంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఏర్పడిన ముసలం పార్టీను పూర్తిగా ముంచేస్తుందనే ఆందోళన లేకపోలేదు.