హైదరాబాదులో ఈకాం ఎక్స్ప్రెస్ ఈ-బైక్స్

ఈ-కామర్స్ రంగానికి ఆద్యంతం లాజిస్టిక్ పరిష్కారాలను అందించిన భారతదేశంలో అగ్రగామి సాంకేతికతలలో ఒకటైన, ఈకాం ఎక్స్ప్రెస్ లిమిటెడ్, 2025 నాటికి తమ 50% తుది మైల్ ఫ్లీట్ ను విద్యుత్ వాహనాలకు సంక్రమింపజేసేలా తమ ప్రణాళికలను నేడు ప్రకటించింది. సదరు రంగంలో ఒక నిలదొక్కుకోగల సంస్థగా తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, విద్యుత్ వాహనాలకు తమ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు జైపూర్, హైదరాబాదులలో ఈ-బైక్స్ పరిచయం చేయడాన్ని గురించి ప్రకటించింది.

Ecom express e bikes

కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించేందుకు, అలాగే ఈ-కామర్స్ రంగానికి ఒక బాధ్యతాయుతమైన డెలివరీ భాగస్వామిగా నిరంతరం కొనసాగేందుకు విద్యుత్ వాహనాలను అవలంబించడం అనేది ఈకాం ఎక్స్ప్రెస్ వారి అతిపెద్ద నిర్వహణీయ లక్ష్యాలలో ఒక భాగం.

టి.ఎ.కృష్ణన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కో-ఫౌండర్, ఈకాం ఎక్స్ప్రెస్ లిమిటెడ్, మాట్లాడుతూ, “2025 నాటికి తుది మైల్ లో 50% ఎలెక్ట్రిక్ ఫ్లీట్ ను సాధించే దిశగా మేము తీసుకుంటున్న స్టెప్ గా అదనపు విద్యుత్ వాహనాలను జోడించడానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. నిర్వహణీయ గ్రీన్ లాజిస్టిక్స్ దిశగా ఇది ఒక ప్రగతిశీల అడుగు అని, అలాగే భద్రతాయుతమైన పర్యావరణానికి మా నిబద్ధతను ఇది ఉదహరిస్తుందని నేను నమ్ముతున్నాను. లాజిస్టిక్స్ మరియు రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేందుకు నిర్వహణీయ పరివర్తనీయత అనేది ఒక ఉత్ప్రేరకం. ఈకాం ఎక్స్ప్రెస్ వద్ద, నిర్వహణీయ డెలివరీలను చేసేందుకు అతిగొప్ప అవెన్యూలను రూపొందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. ఎలెక్ట్రిక్ బైక్ ల వినియోగం అనేది మా తుది-మైల్ డెలివరీని గ్రీనర్ గా మార్చేందుకు మా ప్రయత్నాలకు ఒక ఆరంభ చిహ్నం.” అన్నారు

ఛార్జింగ్ ఫెసిలిటీతో సహా ఈవి రోల్-అవుట్ కు సపోర్ట్ చేసేందుకు కావలసిన మౌళిక సదుపాయాలను సరైన క్రమంలో ఉంచేందుకు ఈకాం ఎక్స్ప్రెస్ పని చేస్తోంది. తొలి మైల్ లో భాగంగా గత రెండు సంవత్సరాలలో ఢిల్లీ ఎన్ సి ఆర్ లో ఎలెక్ట్రిక్ 3-వీలర్ల ఫ్లీట్ ను ఇప్పటికే కంపెనీ సంభాళించింది, అలాగే తుది మైల్ లో విద్యుత్ బైక్ల విజయవంతమైన వినియోగాన్ని ప్రయత్నించింది కూడానూ. లాజిస్టిక్స్ ను గ్రీనర్ గా చేసేందుకు మరియు పర్యావరణాన్ని కాపాడేందుకు ఈవి ఎకో సిస్టం వ్యాప్తంగా పలు ప్లేయర్లతో కంపెనీ ఇప్పటికే పని చేస్తోంది.

Previous articleఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు నారాయ‌ణ దాస్ నారంగ్ మరణం
Next articleIndian Institute of Management Calcutta Publishes a Case Study on the journey of SAI International School

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here