ఎడ్‌టెక్ అంకురపరిశ్రమ కొత్త వేదిక ప్రెప్‌ఇన్‌స్టా ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్

PrepInsta

ప్రాక్టీస్ కోడింగ్, ఆప్టిట్యూడ్, మరియు కొత్త టెక్నాలజీల కొరకు ఎడ్‌టెక్ అంకుర పరిశ్రమ అయిన ప్రెప్‌ఇన్‌స్టా, కొత్త వేదిక ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్ ని ప్రకటిస్తోంది, అది కాలేజీ విద్యార్థులు మరియు పనిచేస్తున్న నిపుణులకు అభ్యసన సామాగ్రి మరియు అభ్యసన పద్ధతులకు వీలు కల్పిస్తూ ఒక ఓటిటి ఫార్మాట్‌ని అనుసరిస్తుంది.

 

ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్ ఒకే ఒక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ క్రింద 150+ కోర్సులను అందిస్తుంది. కోర్సుల యొక్క కూర్పు ప్రముఖంగా ఆశావహులకు ఉద్యోగ అవకాశాలను విస్తృతపరచడానికి గాను నైపుణ్య ఉన్నతీకరణ కోర్సులు, కోడింగ్ కోర్సులు, ప్లేస్‌మెంట్ తయారీ కోర్సులు మొదలగు వాటితో సహా నైపుణ్య ఉన్నతీకరణ కార్యక్రమాలను కవర్ చేస్తుంది.

సబ్‌స్క్రిప్షన్ లో – ఎఐ/మెషీన్ లెర్నింగ్, సైబర్ భద్రత, C/C++ లో కోడింగ్ కోర్సులు, పైథాన్, డిఎస్ఎ, కాంపిటీటివ్ కోడింగ్ వంటి నైపుణ్య ఉన్నతీకరణ కోర్సులు ఉంటాయి మరియు ఈ ప్లాట్‌ఫామ్ అమెజాన్, టిసిఎస్, ము సిగ్మా, కేప్‌జెమిని బ్రాండులకు కంపెనీ-నిర్దిష్ట సూక్ష్మ-కోర్సులను మరియు ఇతర 150+ కోర్సులను కూడా అందజేస్తుంది.

“ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తో అభ్యాసకులు స్థోమతకు తగిన ధరలో నాణ్యమైన విద్యకు ప్రాప్యతను పొందేలా అభ్యసనాన్ని ప్రజాస్వామ్యయుతం చేయాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము. విద్యార్థులు అభ్యసనా ఫలితాలను త్యాగం చేయకూడదు మరియు కొత్త డిజిటల్ ప్రపంచములో అన్ని నైపుణ్యాలు, టెక్నాలజీలు మరియు ఉద్యోగ అవకాశాలకు ప్రాప్యతను కలిగి ఉండి వాటిని అన్వేషించాలి,” అన్నారు ప్రెప్‌ఇన్‌స్టా (PrepInsta) సిఇఓ మరియు సహ-వ్యవస్థాపకులు శ్రీ అతుల్యా కౌశిక్ గారు.

“2022 సంవత్సరం ఆఖరునాటికి సుమారుగా 100 వేల అభ్యాసకులను ఉన్నతీకరించాలని లక్ష్యంగా చేసుకున్నాము. అదనంగా, ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్ మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా కొత్త కోర్సులను జోడించడం కొనసాగిస్తూ ఉంటుంది.  ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ఆఖరు నాటికి, దాని పోర్ట్ ఫోలియో పైన కనీసం 300 కోర్సులను కలిగి ఉండాలని మేము యోచిస్తున్నాము.”, అన్నారు ప్రెప్‌ఇన్‌స్టా ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ మనీష్ అగర్వాల్ గారు.

 

ఆశావహులు కేవలం ఒకే ఒక్క కోర్సును మాత్రమే ప్రాప్యత చేసుకోగలిగి మరియు పరిమితం విధించబడే ఇతర ప్లాట్‌ఫామ్ ల వలె కాకుండా, వారు గనక ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్ ద్వారా అన్వేషణ చేయాలనుకుంటే ప్లాట్‌ఫామ్ పై ఉండే అన్ని కోర్సులనూ అందుబాటు చేసుకోవచ్చు. విద్యార్థుల కొరకు సబ్‌స్క్రిప్షన్లు 3 నెలలకు గాను రు.2499 లతో మొదలై 48 నెలలకు రు. 6499 వరకూ అతి తక్కువ నామమాత్రపు ధరలలో లభిస్తాయి.

 

Previous articleకిచెన్ సింక్ వాటర్ రీసైకిల్ సిస్టమ్ డిజైన్ చేసిన గీతమ్ విద్యార్థులు
Next articleఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు నారాయ‌ణ దాస్ నారంగ్ మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here