Home వైద్యం-ఆరోగ్యం క‌రోనా నుంచి కోలుకున్నారా.. అయితే మీ కంటిచూపు జాగ్ర‌త్త‌!

క‌రోనా నుంచి కోలుకున్నారా.. అయితే మీ కంటిచూపు జాగ్ర‌త్త‌!

కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన రోగులలో రెటీనా సమస్య‌ల‌తో కంటి చూపు మందగిస్తుంది. నేత్ర స‌మ‌స్య‌లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అల‌క్ష్యం చేసినా పూర్తిగా కంటిచూపును కోల్పోతారు జాగ్ర‌త్త అంటున్నారు వైద్యులు. కరోనా కారణంగా రెటీనాకు రక్త సరఫరాలో ఆటంకం కలిగి అది పలు కంటి సమస్యలకు దారితీస్తున్నది. ఇలాంటి సమస్యలో ‘రెటినోపతి’ అనేది ప్ర‌ధాన‌ సమస్య. రెటినోపతి అనేది ఒక రకమైన రెటీనల్‌ వాస్కులర్‌ వ్యాధికి సంబందించినది, రక్త సరఫరా అసాధారణంగా జరగడం వలన కంటిలోని రెటీనా దెబ్బతిని ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతున్నది. అదేవిధంగా కోవిడ్‌-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులలో ఊపిరితిత్తులు మరియు ఇతర సమస్యలను తగ్గించేందుకై స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారు, దాని కారణంగా వారిలో స్టెరాయిడ్‌ సంబంధితమైన నేత్ర సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది

కోవిడ్‌ లేదా స్టెరాయిడ్‌ చికిత్స కారణంగా వచ్చే రెటినోపతి సమస్య కోవిడ్‌ వ్యాధి పరిష్కారమైన 2 నుండి 4 వారాల లోపల ఏర్పడుతున్నది. కావున కోవిడ్‌ నుండి కోలుకున్న రోగులు మరియు స్టెరాయిడ్ల చికిత్సలు పొందిన రోగులు తొలి వారాలలో లేదా ఊపిరితిత్తుల సమస్యలకు స్టెరాయిడ్ల చికిత్సను అందుకున్నంత కాలం అలాంటి లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కన్ను ఎర్ర బడడం లేదా నొప్పి కలిగివుండడం వంటి లక్షణాతో సంబంధం లేకుండా కంటి చూపు మసకబారడం అనేది ఇందులో అత్యంత సాధారణంగా కనపడే లక్షణం. రెటీనల్‌ రక్తనాళంలో అడ్డంకి ఏర్పడడం లేదా రెటీనా వాపు కారణంగా రెటినోపతికి గురౌతున్న రోగులను మేము చూస్తున్నాము. ఇప్పటివరకు మా వద్దకు వచ్చిన కేసుల అధారంగా ఇటువంటి పరిస్థితికి దారితీసే ప్రమాదం 0.1% కంటే తక్కువగా ఉండడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చని’’ ఎల్‌వి ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, సీనియర్‌ రెటీనా కన్సల్టెంట్‌, డాక్టర్‌ రాజా నారాయణన్‌ అన్నారు.

కోవిడ్‌ నుండి కోలుకున్న రోగులందరూ వివరణాత్మకంగా కంటి పరీక్ష చేయించుకోవడం అనేది తప్పనిసరేమి కాదు, అయితే కంటి చూపు మందగించడం లేదా అలాంటి లక్షణాలే కలిగివున్నవారు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తమ కళ్లను పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ భౌతికంగా వారు హాస్పిటల్‌ను సందర్శించలేకపోయినా, టెలికన్సల్టేషన్‌ ద్వారా తమ కళ్లను పరీక్షచేయించుకోవాలని’’ డాక్టర్‌ నారాయణన్‌ అన్నారు.

‘‘పెద్ద వయస్సున్న కోవిడ్‌ రోగులకు చికిత్సగా స్టెరాయిడ్లను అందించినట్లయితే వారిలో అది సంబంధిత రోగనిరోధక తగ్గుదల దశకు దారితీసి తద్వారా వారిలో హెర్పెస్‌ జోస్టర్‌ ఆప్తాల్మికస్‌ వంటి కొన్ని వైరల్‌ పరిస్థితులకు దారితీయవచ్చు. ఎర్రబడడం మరియు రసిక కారడం వంటి సెకండరీ కంజెక్టివిటిస్‌ తరహా క్షణాలతో పాటు చర్మంపై దద్దుర్లు మరియు చిట్లిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కళ్లు మరియు దాని చుట్టుపక్కల నొప్పి / జదరింపు వంటి పరిస్థితుంటుందని’’ ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, సీనియర్‌ కార్నియా కన్సల్టెంట్‌, డాక్టర్‌ సునీత చౌరాసియా అన్నారు.

‘‘కంటికి సంబంధించి మంచి ఆరోగ్య పద్దతును అవంభించడం, అప్రమత్తంగా ఉండడం మరియు మీ కంటి చూపుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ప్రారంభంలోనే వ్యాధిని నిర్దారించి చికిత్సను అందించినట్లయితే రోగి కంటి చూపును కాపాడడానికి సాధ్యమౌతుంది’’ అని డాక్టర్‌ చౌరాసియా సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here