క‌రోనా క‌మ్మేసే వేళ కంటిచూపు జ‌ర‌భ‌ద్రం

క‌రోనా మహమ్మారి ఇంకా కొంతకాలం ఉంటుంద‌నేది అంచ‌నా వేయలేం. వ్యాక్సిన్ వ‌చ్చేందుకు ఐదేళ్లు ప‌ట్ట‌వ‌చ్చు. ఇటువంటి స‌మ‌యంలోనే అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఏ మాత్రం తేడాలొచ్చినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, సామాజిక దూరం పాటించడం, అనవసర‌ ప్రయాణం చేయకపోవడం చాలా ముఖ్యం. ఇంటివద్దనే ఉంటూ ఆన్ లైన్‌లో పనిచేయడం, చదువుకోవడం,కిరాణా మరియు ఇతర సామాన్లు ఆర్డర్ చేయడంవంటి చాలా పనులు చేసుకోగలం. కానీ, మన ఆరోగ్యం, ముఖ్యంగా మన కంటి ఆరోగ్యం సంగతేమిటి? మనకి చూపు తగ్గితే లేదా ఎర్రబడటం లేదా నొప్పి ఉంటే ఎలాగ? అది అత్యవసరమా లేదా కొంతకాలం ఆగవచ్చా అనేది మనకు ఎలాగ తెలుస్తుంది? కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లడాన్ని వాయిదా వెయ్యాలా? ఫ‌లితంగా నేత్ర స‌మ‌స్య‌లు పెరుగుతాయంటున్నారు ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ
నేత్ర‌వైద్య‌నిపుణులు డా సోమశిలా మూర్తి.

ఒక రోగిగా పని చేసుకోవడానికి అవసరమైన అతి ముఖ్య ఇంద్రియాలలో ఒకటి దృష్టి. అందుకే మీ కళ్ళగురించి మీరు సహజంగా ఆందోళన చెందుతారు. కొన్ని వ్యాధులకు తొలి దశలలో జాగ్రత్తలు తీసుకోకపోతే, అది శాశ్వతంగా చూపుపోవడానికి దారితీయవచ్చని కూడా తెలిసినదే. ఈ సమయాలలో, రోగి స్థితిని తొలిసారిగా అంచనా వేయడానికి మరియు రోగి ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉందా, లేదా అని నిర్ణయించడంలో టెలీకన్సల్టేషన్/టెలిపోన్ మరియు విడియోద్వారా సంప్రదించడం చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.

టెలీ కన్సల్టేషన్ కోరుకోవలసిన మరియు ప్రత్యక్షంగా సందర్శనను నివారించదగిన పరిస్థితులు:

– కళ్ళు పొడిబారడం, కంటి అలసట, అసౌకర్యం ఫిర్యాదులు: ప్రస్తుతం చాలామంది ఆన్లైన్లో పనిచేస్తున్నందుకు తప్పనిసరిగా కంప్యూటర్ల వాడకంవలన మరియు పని కారణంగా లేదా వినోదంకోసం డిజిటల్ మీడియాను దీర్ఘ సమయం ఉపయోగించడంవలన తరచుగా ఇది జరుగవచ్చు.

– కంటి ఎరుపు, కంటి వాపు, స్వల్పం నుంచి మితంగా నొప్పి, నీరుకారడం, దురద, కనురెప్పలో బుడిపెల సమస్యలు: ఈ స్థితులలో చాలావాటికి వైద్యపరంగా చికిత్స చేయవచ్చు. విడియో కన్సల్టేషన్ తో సహా ఒక మంచి టెలీకన్సల్టేషన్ చికిత్సకు మొదటిమెట్టు అవుతుంది.

అత్యవసరంగా మీరు ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళవలసి ఉంటుంది?

– ఉన్నట్లుండి చూపు పోవడం

– ఎరుపుదనం, కాంతి సున్నితత్వంతో కూడిన తీవ్రమైన నొప్పి సమస్యలు: ఇవి ఒక తీవ్రతరమైన కంటి వ్యాధి సూచనలు కావచ్చు. అందువలన, అటువంటి సమయంలో రోగి ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధపడాలి.

– ఇంటిలోని రసాయనాలు ప్రమాదవశాత్తూ కంటిలో పడటం, పనిచేస్తున్నప్పుడు/ఆడుకుంటున్నప్పుడు ఒక మొద్దుబారిన లేదా పదునైన వస్తువుతో కంటికి గాయంవంటి ఏదైనా ముఖ్యమైన గాయం.

ఒక అత్యవసరంగా కాకుండా, క్రమబద్ధమైన ఫాలో-అప్ అలక్ష్యం చేయలేని ఏ సమయాలలో మీరు ఆసుపత్రికి వెళ్ళవలసి ఉంటుంది:
– దృష్టి క్షీణత ఉన్నా, క్షీణతలేని మధుమేహ రోగి
– గ్లకోమా లేదా కార్నియా మార్పిడుల వంటి ఇతర కంటి వ్యాధులున్న‌ రోగులు
– ఆఫ్థల్మాలజిస్ట్ సూచన ప్రకారం మందులు తీసుకుంటున్న ఇతర దీర్ఘకాల సమస్యలు (యూవైటిస్, మొ.)

ఆసుపత్రికి వెళ్ళడం ఎంతవరకూ సురక్షితం:
– కోవిడ్ ఇన్ఫెక్షన్ సంభావన లక్షణాలున్న రోగులను ప్రవేశద్వారం వద్దనే వేరుగా పరీక్షచేసే ఒక ట్రయాజె ప్రక్రియ
– వేచి ఉండే స్థలాలు లేదా క్లినిక్లలో అతిగా జనసమర్ధం లేకుండా ఉండటానికి ఒక సమానమైన ప్రవేశం మరియు నిష్క్రమణ రోగి నంబర్లను నిర్వహించడం
– కూర్చుని ఉన్నప్పుడుకూడా రోగుల మధ్య ఒక మీటరు సామాజిక దూరం పాటించడం
– సిబ్బంది మరియు రోగులు ఒకరికొకరు బహిర్గతం కాకుండా ఆసుపత్రి సిబ్బంది వ్యక్తిగత భద్రతా సామగ్రిని ఉపయోగిస్తున్నారు.
– రోగులను పరీక్ష చేయడానికి ఉపయోగించిన సామగ్రిని ప్రతి పరీక్ష తరువాత స్టెరిలైజ్ చేస్తున్నారు.
– రోగుల ఆసుపత్రి సందర్శనాల సంఖ్యను తగ్గించడానికి టెలీకన్సల్టేషన్ ద్వారా ఫాలో-అప్ ప్రోత్సహించబడుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here