తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుంది. భారీ ఎత్తున సీమ జిల్లాల నుంచి జనాన్ని తరలించి మరీ దారుణాలకు తెగించింది. ఎన్నికల రోజున అధికారులు, ప్రతిపక్ష పార్టీలు వందలాది మంది ఓటేసేందుకు వరుసలో నిలబడిన వారిని అడిగినపుడు ఈ విషయం బట్టబయలైంది. తండ్రి, భర్త పేరు చెప్పలేక ముఖం తేలేసి పక్కచూపులు చూస్తూ అక్కడ నుంచి జారుకోవటం వీడియో ద్వారా అందరూ చూశారు. ఇదంతా వైసీపీ పనేనంటూ టడీపీ, బీజేపీ ఆరోపిస్తే.. మాకు అలాంటి పరిస్థితి లేదు. లక్షల మెజార్టీ వచ్చేందుకు జగన్ పథకాలు చాలంటూ మంత్రులు బుకాయించారు. పైగా దొంగ ఓట్లతో గెలవాలని చూసింది టీడీపీ, బీజేపీయేనంటూ ఎదురుదాడికి దిగారు. అంత వరకూ ఓకే.. కానీ తాజాగా చెవిరెడ్డి ఆడియో క్లిప్పు ఒకటి బయటకు వచ్చింది. దొంగ ఓట్ల వెనుక వైసీపీ నేతలు ఎంత చాకచక్యంగా వ్యవహరించానేది అద్దంపడుతుంది.
ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి తరలించేందుకు 450 మంది రెడీగా ఉన్నారంటూ అవతలి వైపు దళారి చెబుతున్నారు. దీనికి చెవిరెడ్డి అంత ఇబ్బంది పడి 9 గంటల ప్రయాణంతో వాళ్లను తీసుకురావటం కష్టమంటున్నారు. దారిలో చెకింగ్‌ల్లో పట్టుబడితే కష్టమంటూ ఆందోళన కూడా వెలబుచ్చాడు. 400 ఓట్ల కోసం అంత రిస్క్ వద్దని ఇక్కడే చూసుకుంటామంటూ భరోసానిచ్చాడు. మరి దీనిపై చెవిరెడ్డి ఇంత వరకూ స్పందించలేదు. ఓస్.. ఇదంతా ఫేక్ అంటూ అననూ వచ్చంటూ టీడీపీ ఎద్దేవా చేస్తుంది. నిజానికి తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకే అనుకూలంగా ఉంటుంది. టడీపీ, బీజపీ, జనసేన మూడు పార్టీలు ఓట్లు పంచుకోవటం వల్ల వైసీపీ లాభపడే అవకాశం ఉందనేది ఆ పార్టీనేతలకూ తెలుసు. అయినా ఇతర జిల్లాల నుంచి బస్సులు, కార్లలో జనాన్ని తరలించి దొంగ ఓట్లు వేయించటం వెనుక 5 లక్షల మెజార్టీ అనే మాట వినిపిస్తుంది. గతంతో పోల్చితే ఒక్క ఓటు తగ్గినా వైసీపీ ప్రభుత్వంపై తిరుపతిలో వ్యతిరేకత మొదలైందనే ప్రచారం చేసే అవకాశం విపక్షాలకు దొరికినట్టవుతుంది. ఇద మున్ముందు వైసీపీను ఆత్మరక్షణలోకి నెట్టేసే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కనబెట్టినా.. అధినేత జగన్ ఆదేశించినట్టు 5 లక్షల మెజార్టీ గురుమూర్తి సాధించకపోతే ఏ నేత మాడు పగులుతుందనే భయం కూడా కావచ్చనేది విశ్లేషకుల అంచనా. ఏమనా వైసీపీ తిరుపతి ఉప ఎన్నికల్లో చేసిన పొరపాట్లు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి, పార్టీకు కూడా చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశఃం ఉందంటూ ఆ పార్టీ పెద్దలే ఆందోళన చెందుతున్నారట.



