మెగాస్టార్ చిరంజీవి కి కరోనా అని తెలిసినప్పటి నుండి ఆందోళన మొదలయింది.అన్నయ్య త్వరగా కోలుకోని ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చాలా మంది అభిమానులు అనేక దేవాలయాలు, చర్చిలలో మసీదుల్లో పూజలు నిర్వహిస్తున్నారు.దేశం లోనే కాదు ఇతర దేశాలలో వున్న అభిమానులు కూడా చిరంజీవి Get well soon అంటూ ప్రార్ధనలు చేస్తున్నారు. ఎటువంటి లక్షణాలు లేవని చిరంజీవి స్వయంగా ప్రకటించినప్పటికీ తగిన వైద్యం తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి అభిమానులని అలరించాలని కోరుకుంటున్నారు.