ప్రాధమిక చికిత్స మాత్రమే ప్రాణాలు కాపాడగలుగుతుంది

ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు.  అదే సమయంలో లక్షలాది మంది ప్రమాదాలలో గాయపడి శాశ్వత లేదా తాత్కాలిక అంగవైకల్యం లేదా మరో దీర్ఘకాలిక ఆరోగ్య రుగ్మతకు గురవుతున్నారు.  ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా మరణాన్ని నిరోధించడం, అంగవైకల్య ప్రభావాన్ని తగ్గించడంలో వేగంగా అందించే ప్రాధమిక చికిత్స మాత్రమే దోహదపడుతుందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.  హాస్పిటల్ లేదా ఆరోగ్య నిపుణులు అందుబాటులోనికి వచ్చే లోగా అందించే ఈ ప్రాధమిక చికిత్స మనిషి ప్రాణం, గాయ తీవ్రతను తగ్గించడడంలో ఖచ్చితంగా పని చేస్తుంది.

ఈ దిశగా ఏం చేయాలి…

ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొన్న వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొన్న వ్యక్తి సహాయాన్ని అందించే క్రమంలో ముందుగా తనకు ఎటుంవటి ప్రమాదం ఏర్పడదని నిర్థారించుకొని వెంటనే గాయపడిన వ్యక్తిని ప్రమాద స్థలి నుండి వెలికి తీసి సురక్షితమైన ప్రదేశానికి చేర్చాలి.  అలా కాని పక్షంలో అక్కడే గాయపడిన వ్యక్తిని సురక్షితమైన స్థలోం ఉంచి ముందుగా ఆంబులెన్స్ కు సమాచార మందించే చర్యలు తీసుకొని వెనువెంటనే ప్రాధమిక చికిత్స ప్రారంభించాలి.

ఇక గాయపడిన వ్యక్తి స్పృహలో లేకుండి గాలి పీలుస్తూ మరే బాహ్యంగా కనిపడే గాయాలు లేకుంటే అతని తల పైకుండేలా చసి కాళ్లను కొద్దిగా మడచి చేతులలో ఉంచుకొని ఆంబులెన్స్ వచ్చే వరకూ అతని పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలి.  ఒక వేళ గాయపడిన వ్యక్తి ఊపిరి పీల్చకుంటే వెంటనే CPR (Cardiopulmonary resuscitation ) చేయడం ప్రారంభించాలి.  ఒక వేళ మీకు CPR (Cardiopulmonary resuscitation ) ఇవ్వడం పూర్తిగా తెలియకపోతే చేతులతో గుండెల మీద నొక్కడం చేయడం వలన కొంత మేర ఫలితం ఉంటుంది.

ఒక వేళ శరీరంలో ఎక్కడైనా ఎముకలు విరిగాయన్న విషయంపై అవగాహన లేక పోతే, ఖచ్చితంగా ఎముకలు విరిగి ఉంటాయన్న భావనతోనే అతనికి సహాయం చేయాలి లేదంటే మీకు తెలియకుండానే గాయాన్ని పెంచిన వారవుతారు.  అతనిని హాస్పిటల్ కు తరలించే వరకూ అవయవాలను నేరుగా ఉంచడమే మంచిది తద్వారా ఇతరత్రా గాయాలు తగులకుండా చూడవచ్చు.  ఒక వేళ గాయం తగిలిందని తేలితే మాత్రం ఆ అవయవాన్ని గట్టిగా కట్టి వేయడం లేదా గుడ్డతో చూట్టి ఉంచడం చేయాలి తద్వారా గాయ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

ఒక వేళ శరీరంలో ఏదైనా గుచ్చుకని ఉంటే దానిని తీసి వేసే ప్రయత్నం చేయవచ్చు.  అయితే ఈ ప్రయత్నంలో విరిగిన లేదా గాయపడిన ఎముకను యధాస్థానంలో ఉంచడానికి మాత్రం ప్రయత్నించకూడదు.  దానిని కేవలం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.  ఇక ఎముక విరిగి ప్రక్కకు జరిగి చర్మాన్ని గాయపరచిన సందర్భాలలో గాయాన్ని కొంత మేర శుభ్రపరచవచ్చు.

ఒక వేళ గాయపడిన వ్యక్తికి పెద్దగా నొప్పి లేదా బాహ్య గాయాలు కనిపించకపోయినా లేదా ఆంబులెన్స్ రావడానికి లేటు అవుతుందనుకొన్నా వెను వెంటనే ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న రవాణా సాధానం ద్వారా హాస్పిటల్ కు చేర్చే ప్రయత్నం చేయాలి.

ఇక మరో ముఖ్య గమనిక ఏమిటంటే గాయపడిన వ్యక్తి కి అవసరానికి మంచి నీటిని తాగించకూడదు అసలే తినే పదార్థములు ఇవ్వకూడదు.  ఎక్కువగా నీరు తీసుకొంటే అది గాయపడిన వ్యక్తి ఊపిరితిత్తులలో చేరే ప్రమాదం ఉంటుంది.  ఇక ఆహారం తీసుకొంటే గాయపడిన వ్యక్తికి ఇవ్వాల్సిన వైద్యం ముఖ్యంగా సర్జరీలు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది.

ఇక గాయపడిన వ్యక్తిలో మనకు కనిపించేది రక్తం లేదా రక్త స్రావం, దీనిపై మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  ఎక్కువ సందర్భాలలో ఈ రక్త స్రావాన్ని ఎక్కువగా అంచనా వేసి దానిని నిలుపడంపై దృష్టి ఎక్కువ కేంద్రీకరించి ఇతర ప్రమాదకరమైన గాయాల నుండి దృష్టి మళ్లి పోయే ప్రమాదం ఉంటుంది.  అందుకే రక్త స్రావం పై దృష్టి కేంద్రీకరించే ముందు ఆ వ్యక్తి లో ఇంకేమైనా ప్రమాద కరమైన గాయాలున్నాయా లేదా అని నిశితంగా పరిశీలించాలి.  అలా పరిశీలించిన పిమ్మట తగు జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత రక్త స్రావం ఆపడానికి దానిపై ఒత్తిడి కలిగించే కట్టు కట్టడం మంచి పరిష్కారం.  అందుబాటులో ఉన్న పరిశుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించి రక్త స్రావం జరుగుతున్న ప్రదేశంలో గట్టిగా కట్టుకడితే దాన్ని అరికట్టవచ్చు.  ఇక పలు ప్రదేశాలలో రక్తస్రావం జరుగుతుంటే ముందుగా అత్యంత ప్రమాదకారిగా ఉన్న ప్రదేశంలో కట్టు గట్టి తర్వాత చిన్న వాటిపై దృష్టి సారించవచ్చు.

ఇక బాహ్యంగా కనిపించే పలు గాయాలు అంటే బయటకు కనిపించేలా విరిగిన ఎముకలు లేదా లోతుగా చీల్చబడిన గాయాల వంటి వాటి కారణంగా ఎక్కువ రక్త స్రావం జరుగవచ్చు.  దీనిని ఆపడానికి గట్టిగా కట్టు కట్టినప్పటికీ అవి ఆగకపోవచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్ల మీద ఉండే ఇలాంటి గాయాలకు టార్నిక్వెట్ అనబడే దమనిని అదిమి గాయం నుండి రక్తస్రావం కలగకుండా ఆపే కట్టు  ను కట్టడం చేయాలి.  అయితే ఇది అన్ని సందర్భాలలో అందుబాటులో ఉండదు కేవలం అత్యవసర వైద్య బృందం అందుబాటులో ఉంటే ఆంబులెన్స్ లో మాత్రమే ఉండవచ్చు.  అందుబాటులో లేని పరిస్థితులలో కర్ర ను ఒక వస్త్రాన్ని ఉపయోగించి కట్టు కట్టవచ్చు. అయితే ఇది పూర్తిగా అవగాహన ఉన్న మాత్రమే చేయాలి లేదంటే ఇంకా ప్రమాదకారిగా మారవచ్చు.

ఇక గాయాలలో చిక్కుకున్న పదార్థాలను అలానే ఉంచాలి.  వాటిని పీకడం లేదా తొలగించడం వలన కొన్ని సందర్భాలలో గాయాలు పెద్దవి కావచ్చు లేదా ఎక్కువ రక్త స్రావం జరుగవచ్చు.  ఆ పదార్థం గుచ్చుకొన్న తీరును నిశితంగా పరిశీలించి ఏ మాత్రం ప్రమాదం లేదని నిర్థారించుకొన్న తర్వాతనే తీయాలి తీసె ముందు రక్త స్రావాన్ని ఆపే లా కట్టు గట్టే సామగ్రి సిద్దం గా ఉంచుకోవాలి.

ప్రమాదం జరిగిన వెంటనే పైన పేర్కొన్న అంశాలపై అవగాహన ఉన్న వారు దగ్గర ఉండడం వలన ఎన్నో మరణాలను ఆపగలగుతాం అనడం లో సందేహం లేదు.  అందుకే ప్రాధమిక చికిత్స పై ప్రతి ఒక్కరికి అవగాహన మరియు శిక్షణ ఉండడం ఎంతైనా అవసరం.  తద్వారా ఎన్నో మరణాలను లేదా గాయపడిన వారు వికలాంగులుగా మారడాన్ని నిరోధించవచ్చు.

Dr. G Satish Reddy, MS,M.Ch(Ortho) U.K.
Senior Consultant Orthopedic Surgeon,
Joint Replacement Surgeon and Specialist in Sports Medicine
Aster Prime Hospital, Ameerpet, Hyderabad. 

Previous articleశ్రీధ‌ర్ @శ్రీమంతుడు!
Next articleడ్ర‌గ్స్ మాఫియాలో ర‌కుల్‌.. మిస్ట‌ర్ N ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here