అపార్టుమెంట్లు
అగ్గిపెట్టెల గూళ్లు
అన్నీ ఇంట్లో
రోగాలన్ని వంట్లో
ఇద్దరుంటే సౌఖ్యం
నలుగురొస్తే నరకం
నాజూకు బండల మరుగుదొడ్డి
జారితే విరుగును నడ్డి
పైపుల లీకుల పొదరిళ్లు
బొద్దింకల బొమ్మరిళ్లు
అద్దెలు బారెడు
పై కొసర్లు మూరెడు
ఏ. సి.ఉంటే జేబుకు చిల్లు
ఏ. సి. లేకపోతే గాలికి చెల్లు
ఇల్లాలుకెంతో వీలు
వృద్ధులకేమో అది జైలు..
విశ్వేశ్వరరావు పెర్నా
సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
9704197101




Excellent గా చెప్పారు సర్
Correct ga cheparu