ఇన్నోవేషన్ సెంటర్ డెన్మార్క్ భాగస్వామ్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ నిర్వహించిన AIM-ICDK వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2.0 లో ఐదు టీమ్‌లలో ఒకటిగా ఎంపికైన గీతమ్ విద్యార్థుల బృందం.
Hyderabad ఏప్రిల్, 2022: గీతమ్ డీమ్డ్-టు-బీ-యూనివర్శిటీకి చెందిన ఆరుగురు సైన్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు కిచెన్ సింకుల్లో నీటిని రీసైక్లింగ్ చేసే స్మార్ట్ విధానాన్ని డిజైన్ చేశారు. అనేక భారతీయ నగరాలు ఎదుర్కొంటున్న నీటి కొరతను అధిగమించడంలో ఈ సరికొత్త విధానం సాయపడగలదు.
డెన్మార్క్ సాంకేతిక విశ్వవిద్యాలయం సహకారంతో ఇన్నోవేషన్ సెంటర్ (ICDK) భాగస్వామ్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ నిర్వహించిన AIM-ICDK వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2.0లో గీతమ్ విద్యార్థుల బృందం రూపొందించిన విశిష్ఠ ఆవిష్కరణ ఐదు టీమ్‌లలో ఒకటిగా ఎంపికైంది. ఈ విజేతలు మే 2022లో డెన్మార్క్‌లో జరిగే ఇంటర్నేషనల్ వాటర్ కాంగ్రెస్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ బృందంలో ఐదుగురు విద్యార్థులు అనిక్ పాంజా, పృథ్వీ త్రిపాఠి, సాయి శశికాంత్ రొక్కం, జెస్విన్ GN, శివాని నర్సిన గీతమ్‌లో బి.టెక్ చదువుతున్నారు. ఆరో విద్యార్థి రుషాలి మిశ్రా B.Sc., (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) సెకండియర్ చదువుతున్నారు. ఈ బృందానికి గీతమ్ వీడీసీ (వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్) కోచ్‌లు వికాస్ కుమార్ శ్రీవాస్తవ్, బొల్లెం రాజకుమార్ మార్గదర్శకత్వం అందించారు. ఆలోచనను కాన్సెప్ట్ నుంచి ఫంక్షనల్‌గా మార్చడానికి వివిధ దశలలో గీతమ్ నాయకత్వం నుంచి ఈ బృందానికి మద్దతు లభించింది.
2019లో చెన్నైలో ఎదురైన దారుణమైన నీటి సంక్షోభపు తీవ్రతను చూసి చలించిన ఈ విద్యార్థులు దానికి పరిష్కారం కనుగొనాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు హైడ్రో గ్రావిట్రిసిటీ అని పిలిచే పర్యావరణ అనుకూలమైన స్మార్ట్ గ్రే-వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ రూపొందించారు. బయోగ్యాస్‌ను ఉత్ప్రేరించే సామర్థ్యం ఇది కలిగి ఉంది. ఇది గిన్నెల కడిగిన తర్వాత కిచెన్ సింక్‌ల నుండి వచ్చే ముదురు బూడిద రంగు నీటిని రీసైకిల్ చేస్తుంది.
జట్టు కోచ్ వికాస్ కుమార్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, “2019లో చెన్నై నీటి సంక్షోభాన్ని చూసిన విద్యార్థులు కిచెన్ సింక్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గీతమ్‌లోని IEEE స్టూడెంట్ బ్రాంచ్‌లోని కోర్ టెక్నికల్ టీమ్‌లో భాగంగా వారు నీటి సంరక్షణకు సంబంధించి ఒక వినూత్నమైన గ్రూప్ ప్రాజెక్ట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఆ సమయంలో చెన్నైలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. రోజువారీ అవసరాలకు కూడా తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్ సింక్‌ల నుంచి వచ్చే నీటిని రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టు ప్రారంభించడానికి బృందానికి ఇది కీలకమైన ఉత్ప్రేరకంగా మారింది. ఈ ఆలోచనకు రూపకల్పన చేసేందుకు అనేక డిజైన్లు చేసి ప్రోటోటైప్ దశకు తీసుకెళ్లేందుకు విద్యార్థులకు 2.5 సంవత్సరాలు పట్టింది.
జట్టు కోచ్ బొల్లెం రాజకుమార్ ఇలా అన్నారు: “విద్యార్థులు స్వీయ నిర్వహణ, స్మార్ట్, రెట్రోఫిట్ చేసుకోగల రెయిన్‌వాటర్, గ్రేవాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ రూపొందించారు. ఇది ఫిల్టర్లు, మెంబ్రేన్లు, సెడిమెంటేషన్ ట్యాంక్‌లు, గ్రీజు ట్రాప్ అమర్చిన బహుళ దశలు కలిగి ఉంటుంది. ఇసుక, బొగ్గు ఫిల్టర్లు నీటిని పూర్తిగా శుభ్రపరుస్తాయి. అంతర్నిర్మిత సెన్సార్లు నీటి నాణ్యత, pH, టర్బిడిటీ, TDS, నీటి పరిమాణం వంటి పారామితులపై నిజ-సమయ డేటా అందిస్తాయి. ఫిల్టర్ చేసిన నీటిని సాగు నీటికి, టాయిలెట్లు శుభ్రపరచేందుకు, ఫ్లషింగ్ కోసం ఉపయోగించవచ్చు. వ్యక్తిగతంగా మన నిత్య జీవితంలోని ప్రతి దశలో సైన్స్ ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఈ సిస్టమ్స్ అన్నింటినీ ఏకీకృతం చేసి పరిమిత స్థలానికి సరిపోయేలా విద్యార్థులు దీనిని రూపొందించారు” అన్నారు.
టీమ్ లీడర్‌లలో ఒకరైన విద్యార్థి అనిక్ పాంజా ఇలా అన్నారు: “సగటున ఒక కుటుంబం ప్రతిరోజూ దాదాపు 356 లీటర్ల గ్రే వాటర్ ఉత్పత్తి చేస్తుంది. నగరాల్లోని మిలియన్ల కొద్దీ రెస్టారెంట్లు, కార్యాలయాలు, గృహాలన్నింటినీ గుణిస్తే ఇది చాలా పెద్ద మొత్తం. ఈ నీరు మురుగు కాలువల్లోకి పోతుంది. ఈ నీటిని రీసైక్లింగ్ చేయడం వల్ల నగరాలను పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక నీటి కొరత కొంతైనా తీరగలదు. మేము ప్లగ్-అండ్-ప్లే గ్రేవాటర్ రీసైక్లింగ్ సిస్టమ్‌ను రూపొందించాం. అదనపు ప్లంబింగ్ అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న కిచెన్ పైపులలోకి దీనిని రీట్రోఫిట్ చేయవచ్చు. ఇది స్మార్ట్‌గా పనిచేస్తుంది, ఎటువంటి చికాకులు ఉండవు. మేము సిస్టమ్‌లో అనేక సెన్సార్లు ఏకీకృతం చేసాం. ఇది స్వయం-నిర్వహణ చక్రాన్ని అడ్డస్ట్ చేసుకొని నీటి వినియోగం, అవుట్‌పుట్ నాణ్యతను పరిశీలించేందుకు వినియోగదారు కోసం ప్రత్యక్ష నివేదికను అందిస్తుంది” అన్నారు.
మరో విద్యార్థి పృథ్వీ త్రిపాఠి మాట్లాడుతూ: “ప్రోటోటైప్ రూపొందించడానికి, పరీక్షించడానికి గీతమ్ మాకు నిధులు, స్థలాన్ని కేటాయించింది. తద్వారా ఉత్పత్తిని వేగంగా రూపకల్పన చేయడానికి మాకు వెసులుబాటు లభించింది. ఇది మా పైలట్ ప్రాజెక్ట్. మా పరిశోధనలో ప్రచురించిన ఫలితాలు ధృవీకరించుకునేందుకు దేశంలోని వివిధ నీటి-పరీక్షల ల్యాబ్‌లను కలిసేందుకు మేము ఇప్పుడు కృషి చేస్తున్నాము. మేము మా ఉత్పత్తిని ఇన్‌స్టాల్ చేయడానికి, పరీక్షించడానికి కొన్ని వాటర్ ఇంటెన్సివ్ తయారీ ప్లాంట్‌లను యాక్సెస్ చేయాలనుకుంటున్నాము” అన్నారు.
విద్యార్థి బృందం సభ్యుడు సాయి శశికాంత్ రొక్కం మాట్లాడుతూ, “హైడ్రో గ్రావిట్రిసిటీ పరిష్కారాన్ని వాస్తవ ప్రపంచంలో తక్షణమే ఉపయోగించవచ్చు. ప్రస్తుతమున్న పైప్‌లైన్స్‌కు దీన్ని అమర్చవచ్చు. దీన్ని గృహ అవసరాల నుంచి పరిశ్రమల స్థాయి వరకూ ఉపయోగించవచ్చు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇంక్యుబేటర్లు, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ మార్గదర్శకత్వంతో ఈ పరిష్కారాన్ని మరింత మెరుగుపరిచేందుకు మేము కృషి చేస్తున్నాం. మీడియం-స్కేల్ ప్రోటోటైప్‌ను రూపొందించడానికి, ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావడానికి నీతి ఆయోగ్ నుంచి సంబంధిత గ్రాంట్ల కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాము” అన్నారు.
గీతమ్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) కి చెందిన వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఈ హైడ్రో గ్రావిట్రిసిటీ ప్రాజెక్టు ఇంక్యూబేట్ అయింది. ఐఐటీ తిరుపతి నిర్వహించిన టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన బిజినెస్ ప్లాన్ పోటీలో ఈ సిస్టమ్ మొదటి బహుమతి గెలుచుకుంది