రంగస్థల కళాకారులకు శుభవార్త – గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ సేవలు ప్రారంభం

ప్రముఖ పౌరాణిక రంగస్థల మెగాస్టార్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ తన పేరిట ఫౌండేషన్ ప్రారంభించి ఇవాళ్టి నుంచి మరింతగా సేవలు విస్తరించారు! నిరుపేద కళాకారులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులను గుర్తించి ఆర్ధిక సహకారం తో భరోసా ఇవ్వాలనే లక్ష్యం తో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభ సేవ గా ఇవాళ్టి నుంచి వంద మంది కళాకారుల ఖాతా లో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా నాటక కళాకారులకు ఆర్ధిక సేవలు అందిస్తున్నామని, ఇంకా సేవలు విస్తరించాలనే ఉద్దేశ్యం తో దేశ విదేశ సౌజన్య మూర్తులు, ప్రముఖుల ఆశీస్సులతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాచూరు గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీ ఎం.వి.సిద్ధార్ధ మార్కండేయరావు బహదూర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, పూర్వ డి.జి.పి శ్రీ హెచ్.జె.దొర, విఖ్యాత అర్ధో వైద్య నిపుణులు డాక్టర్ కె.కృష్ణయ్య ఈ ఫౌండేషన్ కు గౌరవ ముఖ్య సలహాదారులుగా అమూల్యమైన సలహాలు అందించనున్నారు. కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ ఈ ట్రస్ట్ కు చైర్మన్ గా వ్యవహరిస్తారు. గౌరవ సభ్యులుగా హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ జె.వి.రావు, స్వర్ణ ఆగ్రో టెక్ శ్రీ ఎస్.ఉమా మహేశ్వర శర్మ, కళ పత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ వి.సతీష్ బాబు నియమితులయ్యారు. ట్రస్టీలుగా శ్రీ పి.శ్రీనివాసరావు, శ్రీమతి డి.నాగలక్ష్మి వ్యవహరిస్తారని శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ వివరించారు. శ్రీ గుమ్మడి గారికి అభినందనలు

Previous articleదేవుడంటే నల్లరాతిలో కాదోయ్.. మనిషేనోయ్.. ఆంధ్రా బోధిధర్మ ఆనందయ్యను ప్రోత్సహిద్దాం..
Next articleతెలుగు సినీ ఇంద్రుడు రాఘ‌వేంద్రుడు!

1 COMMENT

Leave a Reply to PVRao Cancel reply

Please enter your comment!
Please enter your name here