నిజమే … మీరు చదివింది వందశాతం వాస్తవం. ఈ హీరో గుర్తున్నాడా.. అప్పట్లో మౌనమేలనోయి అంటూ తెలుగుతెరపై లవర్‌బాయ్‌గా కనిపించాడు. ఎస్ అతడే సచిన్ జోషి. అడపా దడపా సినిమాలు తీసినా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. అందుకేనేమో.. రూటు మార్చాడు. నిషేధిత గుట్కా, ఖైనీలను తయారు చేస్తూ.. దేశవ్యాప్తంగా సరఫరా చేయిస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలోనే ఇతగాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీపోలీస్, టాస్క్‌ఫోర్స్, అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 63లక్షల 96వేల రూపాయల విలువైన రాణిబ్రాండ్ గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఉస్మాన్‌గంజ్‌కు చెందిన మీర్జా ను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో గుట్కా నిషేధం విధించారు. కిషన్‌బాగ్ ఏరియాలో ఒక గోదాంను కూడా సీజ్ చేశారు. దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని కూపీలాగగా చాలామంది పెద్ద తలలు ఉన్నట్టు గుర్తించారు. కొన్ని ప్రయివేటు రవాణా ఏజెన్సీలు, కొరియర్ సంస్థలు కూడా కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక నుంచైనా తీరుమార్చకపోతే చర్యలు తప్పవని నగర కొత్వాల్ అంజనీకుమార్ హెచ్చరించారు. ఈ మొత్తం గుట్కా ఎపిసోడ్‌లో సచిన్‌జోషి ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు దొరకటంతో అరెస్ట్ చేశారు.