ఎక్కడైనా అత్తింట కోడళ్లు చవిచూసే ఆరళ్లు చూశాం. భరించలేక సూసైడ్ చేసుకోవటం కళ్లెదుట కనిపిస్తున్నాయి. కానీ.. హైదరాబాద్‌లో ఒక అల్లుడు తన ఇంట్లో మకాం వేసి అత్త,మామల పోరు భరించటం తన వల్లకాదంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. బాబానగర్‌లో ఉండే సయ్యద్‌మోహిన్‌కు ఏడాది క్రితం మెదక్ జిల్లా అమ్మాయితో నిఖా జరిగింది. అంతవవరకూ ఓకే.. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది. కూతురుతోపాటు.. ఆమె తల్లిదండ్రులు కూడా అల్లుడు ఇంటికి చేరారు. పోన్లే కూతురు మీద మమకారం అనుకున్నాడు. కానీ.. అక్కడ ఇద్దరి మధ్య జోక్యం చేసుకోవటంతో గొడవలు మొదలయ్యాయి. కొన్నాళ్లకు కూతురిని తీసుకుని మెదక్ చేరారు. భార్యను ఏదో విధంగా నచ్చజెప్పి ఇంటికి తీసుకువద్దామని వెళ్లిన సయ్యద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇదిచాలదన్నట్లుగా తరచూ అత్తింట ఎదురయ్యే అవమానాలు. ఇవన్నీ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



