రాజనీతి.. రణనీతి రెండింటా భారతదేశానికి ఉన్న గొప్ప ప్రత్యేకతలు. మన ఇతిహాసాల్లో.. యుద్ధవీరుల వ్యూహాల్లోనూ అది కనిపిస్తూనే ఉంటుంది. శక్తివంతుడైన ప్రత్యర్థినీ అవలీలగా దెబ్బతీసేందుకు బలమే కాదు.. బుద్దిబలం కూడా. ఇప్పుడు చైనాకు గుణపాఠం చెప్పేందుకు భారత్ రాజనీతినే కాదు.. యుద్ధతంత్రం కూడా ప్రపంచం చూడబోతుందనే చెప్పాలి.
ప్రాచీన కాలం నుండి భారత్ చైనా దేశాలు ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక మరియు మత పరమైన విషయాల్లో ఇచ్చి పుచ్చుకొని ధోరణి లొనే ఉన్నాయి. రెండవ చంద్రగుప్తుని కాలం భారత దేశానికి బౌద్ధమతం అధ్యయనం చేయడానికి వచ్చిన పాహియాన్ (క్రీ.పూ.399- 412 ) రచనలు, తరువాత ఏడవ శతాబ్దంలో వచ్చిన హుయాంత్సాంగ్ రచనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
భారత దేశం తో అత్యధిక సరిహద్దు ను పంచుకొనే రెండవ దేశం చైనా. బంగ్లాదేశ్ 4156 కి.మీ.. భారత్ తో సరిహద్దు పంచుకుంటే, చైనా 3458 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. రెండు దేశాలు పరస్పరం సహకరించుకొని సమస్యలను పరిష్కరించుకునేందుకు అప్పటి భారత్ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రు, చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లై పంచశీల ఒప్పందం పై ఏప్రిల్ 28 1954 లో ఇరువురు నాయకులు సంతకాలు చేశారు 1962 నాటికి చైనా నాయకత్వం భారత్ పట్ల ప్రదర్శించే తీరులో మార్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దున ఉన్న అక్సయి చిన్ , మనకు ఈశాన్య ప్రాంతాన ఉన్న అస్సామ్ ను ఆక్రమణ చేయడానికి ఉద్రిక్తలను సృష్టించి అది కాస్త యుద్ధం వైపు మళ్లించింది .
చైనా. అక్టోబర్ 20 1962 వ తేదీనుండి నవంబర్ 20, 1962 వరకు యుద్ధం చేసి నవంబర్ 21 న కాల్పుల విరమణను ప్రకటించింది. దాదాపు 3225 కి.మీ. భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. భారత్ కి స్వాతంత్ర్యం వచ్చి పరిస్థితులన్ని చక్కదిద్దుకొనే లోపు చైనా యుద్ధం చేసింది. 1962 అక్టోబర్ నాటికి భారత్ సైన్యం 22, 000 మాత్రమే, చైనా బలగాలు మాత్రం 80, 000 దాకా ఉన్నాయి. 1383 మంది భారత్ సైనికులు, 772 మంది చైనా సైనికులు మరణించారు. గాయపడిన వారు, కనిపించకుండా పోయినవారు ఇరువైపులా వెలల్లోనే. ఆనాడు, అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జాన్ .ఎఫ్. కెన్నెడీ , బ్రిటన్ భారత్ కి సైన్య సహకారం అందించాడానికి నిరాకరించాయి. రష్యా మాత్రము మిగ్ విమానాలను సరఫరా చేసింది.
అనంతర కాలంలో చైనా, భారత్ తో వ్యాపార రీత్యా మంచి సంబంధాలను నెరుపుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఉత్పత్తుల వాడకం పెరగడంతో, చైనా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారత్ కి ఎగుమతులు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో చైనాకు భారత్ అతి పెద్ద కస్టమర్. అదే విధంగా భారత్ కి అమెరికా తరువాత చైనా దేశమే అతి పెద్ద వ్యాపార భాగస్వామి.
2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను చైనా నుండి భారత్ దిగుమతుల విలువ 515.63 బిలియన్ల చైనా యువాన్లు. అంటే భారత్ మొత్తం దిగుమతుల్లో దాదాపు 14.09 శాతం. అదేవిధంగా భారత్ నుండి చైనా కు ఎగుమతుల విలువ 123.84 బిలియన్ల చైనా యువాన్లు..భారత్ మొత్తం ఎగుమతులో 5.33 శాతం మాత్రమే.
2019-20 సంవత్సరానికి భారత్ నుండి ఎగుమతులు208406.52 కోట్లు, భారత్ చైనా నుండి దిగుమతులు 618051.19 కోట్లు రూపాయలు
ఇంత పెద్ద ఎత్తున భారత్ తో వ్యాపారం చేసుకుంటూ, భారత్ పై చైనా కాలుదువ్వడానికి కారణం ఏమిటి..చూద్దాం..
1) చైనా పాలక నాయకత్వం పెట్టుబడి దారి విధానాన్ని అవలంభించడం.ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జింపింగ్ వచ్చాక..
2) భారత్ లో శక్తివంతమైన నాయకత్వం అధికారం లోనికి రావడం చైనా కు కొరుకుడు పడని విషయం
3) ఐక్యరాజ్యసమితి లోని భద్రతా సమితి లో శాశ్వత దేశాలు అమెరికా, ఫ్రాన్స్,బ్రిటన్, చైనా,రష్యా లు, మరియు తాత్కాలికంగా ఎప్పటికప్పుడు ఎన్నుకోబడే 10 దేశాలలో అత్యధిక దేశాలు భారత్ కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదనకు సానుకూల మద్దతు ప్రకటించడం చైనాకు మింగుడుపడడం లేదు.
4) భారత్ కు అమెరికా తో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు 1990 దశకం తరువాత మెరుగుపడడం.
5) G-7 దేశాల గ్రూపులో భారత్ కు సభ్యత్వం ఇవ్వాలని అమెరికా పట్టుబట్టటం చైనా అసూయతో రగిలిపోతుంది
( 1975 లో అమెరికా, జపాన్, బ్రిటన్, జర్మనీ, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా లు కలిసి వ్యాపార నిమిత్తం G-8 దేశాలుగా అవతరించాయి. మార్చి 24, 2014 తేదీన రష్యా ఈ గ్రూప్ నుండి వైదొలిగింది..ఆ స్థానంలో భారత్ ను తీసుకోవాలని అమెరికా, జపాన్, కెనెడా, ఇటలీ లు పట్టుబడుతున్నాయి)
6) భారత్ లో చైనాకు సంబంధించిన 59 యాప్ లను నిషేధించి 45,000 కోట్ల వ్యాపారాన్ని దెబ్బతీయడం.
7) పాకిస్థాన్ తోను, శ్రీలంకతో సంబంధాలు పెంచుకొని భారత్ ను ఇరకాటంలో పెట్టాలని, భారత్ ను ఆర్ధికంగా దెబ్బతీయాలని వక్ర బుద్ది
8) కరోన వ్యాప్తిలో చేసిన కుట్ర తనది కాదని చెప్పడానికి ప్రపంచ దృష్టి మల్లిoమచడానికి యుద్ధ మేఘాలను సృష్టిస్తుందనే వాదన కూడా లేకపోలేదు.
ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే, మరోపక్క సీక్రెట్ ఏజెంట్ లను భారత్ లోకి పంపడం, సరిహద్దు రేఖ LAC వెంబడి సైన్యాన్ని మొహరించి ఉసిగొల్పడం, భారత్ ఆంతరంగిక విషయమయిన కాశ్మీర్ విభజనను అంతర్జాతీయ వేదికలపై చర్చించడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 442 బిలియన్ల రూపాయలతో వివాదాస్పద దాయామన్-భాషా ప్రాజెక్టు నిర్మాణం, రోడ్ల నిర్మాణం వంటి దుశ్చర్యలకు చైనా పాల్పడుతుంది.
అమెరికా పాత్ర
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. అమెరికా ఆయుధాలు భారత్ కు అమ్ముకోవచ్చని, చైనా తో భారత్ సంబంధాలు తెగిపోతే భారత్ కు తన ఎగుమతులు పెంచుకోవచ్చని ఒక కారణం, చైనా ఆర్ధికంగా తనకంటే ఎదుగుతుందనే భయం, కరోన వైరస్ వ్యాప్తి విషయం కావాలని చైనా దాచి ఉంచిందనే నెపం, అమెరికా స్వార్ధం తో తప్ప, భారత్ పై ప్రేమ ఉండి మద్దతు ఇస్తుంది అనేది అవాస్తవం.
2019- 20 సం. కి మార్చి 2020 నాటికి 35.73 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం భారత్ , అమెరికాల మధ్య జరిగింది. అమెరికాకు భారత్ ఎగుమతులు 13.1 బిలియన్ అమెరికన్ డాలర్ లుంటే, దిగుమతులు..22.64 బిలియన్ల అమెరికన్ డాలర్లు. అమెరికాతో వ్యాపారం చేసే అతి పెద్ద దేశాల్లో భారత్ 13 వ స్థానంలో ఉంది.
అయితే చైనా ను ఓడించడం భారత్ కి కష్టమైనప్పటికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల మద్దతు ఉండడం తో చైనా వెనకడుగు వేయక తప్పదు. చైనాలో కూడా అంతర్గతంగా అనేక సమస్యలు న్నాయి.
క్రిష్టోఫర్ బాల్డింగ్ అనే విశ్లేషకుడు 11.3.2019 నాడు రాయిటర్ పత్రికకు రాసిన వ్యాసంలో చైనా యొక్క అంతర్గత సమస్యలను ప్రస్తావించాడు. అవి కొన్ని..
1979 లో చైనా జనాభా నియంత్రణ లో భాగంగా ఒకరు లేక అసలు సంతానం లేకపోవడం (ONE OR NONE POLICY ) ని అమలు చేయడం వల్ల యువశక్తి తగ్గిపోయింది.
వయసు మీద పడ్డ వారి జనాభా , వారి సంక్షేమ ఖర్చు ఎక్కువ కావడం,
జననాల రేటు తగ్గడం,
ఫెడరల్ రిజర్వ్ కొరత,
SIPRI( Stockholm International Peace Research Institute ) నివేదిక ప్రకారం..
నువ్వా..నేనా అనేంతగా సైనిక సంపత్తి
2019 సం. నాటికి చైనా కు
20,35,000 మంది శాశ్వత సైన్యం, 5,10,000 మంది రిజర్వ్ సైన్యం ఉంది.ఏటా చైనా 261 బిలియన్ల అమెరికన్ డాలర్లు సైన్యంపై ఖర్చు చేస్తుంది.
ఇది చైనా జి.డి.పి లో 1.9%,
భారత్ కి 12,31,117 మంది ఆక్టివ్ ట్రూప్స్, 9,60,000 మంది రిజెర్వ్ లో వున్నారు. భారత్ సైన్యం మీద పెట్టె ఖర్చు 732 బిలియన్ అమెరికా డాలర్లు.
భారత్ జి.డి.పి.లో 3.4% .
Indian Information Technology Act, Sec.69A,
ప్రకారం దేశ భద్రత దృష్ట్యా. 2020 సం. సెప్టెంబర్ 2 వ తేదీన పబ్జీ తో సహా 118 ఉత్పత్తులను నిషేధించడం చైనాకు కోలుకోలేని దెబ్బ…ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని దారికొస్తుందేమో వేచి చూద్దాం…లేకపోతే చైనా గుణపాఠం నేర్చుకోక తప్పదు…ప్రపంచంలో చైనా ఏకాకి కాక తప్పదు…
-పెర్నా విశ్వేశ్వరరావు, విశ్లేషకులు
మీ విశ్లేషణ బాగానే ఉంది. కానీ టైటిల్ కి తగ్గట్టుగా మీరు ఇంకా వివరాణాతంకంగా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. 🙏
వివరణాత్మక మైన విశ్లేషణా వ్యాసం.. చైనా దేశానికి బుద్ధి చెప్పే క్రమంలో మిగతా దేశాలు ఇండియా ను అమెరికాను అనుసరిస్తే చైనాకు త్వరగా కళ్లెం వేయవచ్చు… వెఱ్ఱి వేషాలతో ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే దాని ఆశను ఆదిలోనే తుంచివేయాలి.
మీ విశ్లేషణ బాగానే ఉంది. కానీ టైటిల్ కి తగ్గట్టుగా మీ అభిప్రాయం ఇంకా వివరాణాతంకంగా ఉంటే చాలా బాగుంటుంది. 🙏
Thanks for the suggestion Sir.
బొల్లేపల్లి జగన్నాథాచార్యులు:
చాలా చక్కగా విశ్లేషించారు. మన వార్తా సాధనాలు ప్రభుత్వం చేసే మంచిపనులు ఎందుకనో ఎక్కువగా చూపిచడం లేదు. ఏదైనా తప్పు ఉంటే మట్టుకు పదే పదే చూపిస్తారు. చక్కని వివరాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు విశ్వేశ్వర రావుగారు .
Good and matured analysis. Let us expect more from your pen..
విశ్వేశ్వరరావు గారు.. చాలా చక్కగా విశ్లేషించారు.. యుద్ధభూమిలో ఇరు దేశాల సామర్థ్యం.. దీనివల్ల ప్రపంచం ఎదుర్కోబోయే సవాళ్లను కూడా ఇస్తే బావుంటదని సూచన.
Sir super
Sir super review
ధన్యవాదములు రావు గారు. మీ సూచన చాలా విలువైనది. తదుపరి అంశాల్లో తప్పక పాటించగలము
Many many thanks to Mr.Nayeem,Mr.Raghubabu,Mr.Sowmi,
Mr.Suresh, Mr.Rao,..
And Special thanks to Mr BJ Acharyulu Sir, it’s your blessings. I am very glad to receive good remarks from an intellectual like you…
Once again thank you one and all.
We meet again with another one.
good analysis
Good analysis sir tnq for the information
Good analysis sir tnq for the good
information
మంచి వివరణాత్మక విశ్లేషణ..