మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆచార్య పూర్తవగానే వినాయక్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్, ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకుడుగా వేదాళం తమిళ మూవీ రీమేక్ చేయబోతున్నారు. రెండు సినిమాలు ఒకదానికి కొకటి పోటీపడే యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ కలబోసినవే. తమిళ, మళయాళ సినిమాల రీమేక్‌లను తెలుగు నేటివిటీకు దగ్గరగా తీసేందుకు దర్శకులు తెగ కసరత్తు చేస్తున్నారు. వినాయక్ చేతిలో లూసిఫర్ సరికొత్తగా ఉండబోతుందంటున్నారాయన. సైరా నరసింహారెడ్డిలో ఫ్యాన్స్ అన్నయ్య నుంచి మిస్సయిన డ్యాన్స్‌లను లూసిఫర్‌లో భర్తీ చేయాలని వి.వి.వినాయక్ మార్పులు.. చేర్పులు చేయబోతున్నారట. మరో సినిమా.. వేదాళం తెలుగు రీమేక్‌లో చెల్లి పాత్ర చాలా కీలకం.. ఈ కేరక్టర్ కోసం సాయిపల్లవి, కీర్తిసురేష్ ఇద్దరి పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరిగా చిరంజీవి మాత్రం కీర్తిసురేష్‌కే ఓటేశారట. నిజానికి సెంటిమెంట్‌పాత్రలు పోషించటంలో మెగాస్టార్ స్టయిలే వేరు. కామెడీ, ఎమోషన్ కలబోసిన అన్నయ్యగా తమ్ముళ్లు, చెల్లెళ్లను ఎంతగా ప్రేమిస్తారని చాటి చెప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిట్లర్, అన్నయ్య రెండూ సూపర్‌డూపర్ హిట్టు కొట్టాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ యాక్షన్‌తో వేదాళం తెలుగు రీమేక్ పై కూడా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 2015 దీపావళికి విడుదలైన వేదాళంలో అజిత్ హీరోగా అదరగొట్టారు. ఆ తరువాత దీన్ని బెంగాల్‌లో సుల్తాన్ పేరుతో 2018లో రీమేక్ చేసి విడుదల చేశారు. 2021లో తెలుగులో చిరంజీవి వెండితెరపై ఇంకెంతగా మెప్పిస్తారనే దానికోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.