క్రాక్.. మాస్ మహారాజ్ రవితేజ మసాలా మూవీ. పోలీసు పాత్రలో నటిస్తున్న కొత్త మూవీ. వరుస ప్లాప్‌ల తరువాత ఎన్నో అంచనా ల మధ్య వస్తోన్న సినిమా ఇది. రాజాది గ్రేట్ తరువాత ఆ స్థాయిలో మాస్ మహారాజ్‌కు అంత హిట్ లభించలేదు. ఎన్నో అంచనాలతో తీసిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. అయినా నిరాశ పడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. క్రాక్‌పై ఎన్నో అంచనాలున్నాయి. పవర్ పుల్ పోలీసు పాత్రలో మెప్పించటం ఖాయమంటున్నారు సినీజనాలు. జనవరి 1న క్రాక్ టీజర్ విడుదల చేయబోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రవితేజ్ ఈ విషయాలను వెల్లడించారు. తాను డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను కూడా ఫేస్‌బుకలో పోస్ట్ చేశారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంతో రాబోతుంది. శరత్‌కుమార్‌కీలక పాత్రలో మెప్పించబోతున్నారు. వీరశంకర్‌గా రవితేజ నటన విశ్వరూపం చూడాల్సిందేనంటున్నారు అభిమానులు. 2021 జనవరి 14 అంటే.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయబోతున్నా రన్నమాట.