మిస్ట‌ర్ సీ బావున్నారంటున్న ఉపాస‌న కొణిదెల‌!

మిస్ట‌ర్ సీ.. అంటే ఎవ‌ర‌నుకున్నారా! రామ‌చ‌ర‌ణ్‌. స‌తీమ‌ణి ఉపాస‌న పిలిచే ముద్దుపేరు అనుకుంటా. కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్దార‌ణ కావ‌టంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. భ‌ర్తకు క‌రోనా రావ‌టంతో ఉపాస‌న ట్వీట్ట‌ర్ ద్వారా స్పందించారు. త‌న‌లో ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని.. నెగిట‌వ్ వ‌చ్చింద‌ని ఆమె చెప్పారు. కానీ.. త‌న‌కూ కూడా కొవిడ్ వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్టుగా అనుమానం వెలిబుచ్చారు. రామ‌చ‌ర‌ణ్ మాత్రం చాలా దృఢంగా ఉన్నార‌ని.. వైర‌స్‌ను తేలిక‌గా గెలిచి వ‌స్తార‌నే ధీమా వ్య‌క్తంచేశారు. ఇప్ప‌టికే మెగా ఇంట‌.. నాగ‌బాబు వైర‌స్ భారీన‌ప‌డి కోలుకున్నారు.. నాలుగు సార్లు ప్లాస్మా దానం కూడా చేశారు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌.. వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ వైర‌స్‌కు గుర‌య్యారు. ఇటీవ‌లే ఇంట్ల క్రిస్‌మ‌స్ వేడుక‌లు జ‌ర‌ప‌టంతో అంద‌రిలో కాస్త ఆందోళ‌న నెల‌కొంది. మిగిలిన వారికి జ‌రిపిన వైద్య‌ప‌రీక్ష‌ల్లో అందరూ బాగానే ఉన్న‌ట్టు వైద్యులు చెప్పార‌ట‌. అయితే మ‌రోసారి వైద్య‌పరీక్ష‌లు చేసిన త‌రువాత కానీ వైర‌స్‌కు గురైందీ లేనిదీ చెప్ప‌లేమంటున్నారు. ఏమైగా మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ వైర‌స్ నుంచి కోలుకుని.. వీలైనంత త్వ‌రగా ప్లాస్మా దానం చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు.. త‌మ హీరోలు కోలుకోవాల‌ని పూజ‌లు చేస్తున్నారు. ఇటీవ‌లే చిరంజీవితో క‌రోనా దోబూచులాడుకున్న విష‌యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here