ఈరోజు ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ… టీడీపీ నేతల పై తీవ్ర విమర్శలు చేశారు గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాళ్ళు,చంద్రబాబు కు దేవుడంటే అసలు నమ్మకం లేదు.ఏపిలో చంద్రబాబు కుల , మతాలను రెచ్చగోడుతున్నారు.టీడీపీ హయాంలో. విజయవాడలో 41 ఆలయాలను కూల్చి కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు,ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా..? అంటూ ప్రశ్నించారు
పుష్కరాల లో 30మంది ని చంద్రబాబు బలి తీసుకున్నారు. ఎక్కడో చిన్న తప్పిదాలు జరిగితే మంత్రి వెల్లంపల్లి, సీఎం జగన్ మీద బురద చల్లుతున్నారు. బుద్ధ వెంకన్న సైకిల్ బెల్ లను దొంగతనాలు చేసేవాడు.బుద్దిలేని వ్యక్తి బుద్ధ వెంకన్న మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణం ,మంత్రి వెల్లంపల్లి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు .వెండి రథం కి నాలుగు అడుగులు దూరంలో బుద్ధ వెంకన్న ఇల్లు ఉంది. వెండి సింహాలు మాయం పై బుద్దా వెంకన్న ను విచారణ చేయాలి అని కోరారు.