మెగా సోదరుడు నాగబాబు జన్మదినం సందర్బంగా సోషల్ మీడియా వేదికల్లో శుభాకాంక్షల పోస్టులు వెల్లువలా వస్తున్నాయి. తెలుగు సీనిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక మైన స్థానాన్ని సాధించుకున్న నాగబాబు ఎవరిలో టాలెంట్ కనపడ్డ వారిని ప్రోత్సహించి వారికి, వారి టాలెంట్ కి సముచిత స్థానాన్ని కల్పిస్తారు. మెగా అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో వున్న వివిధ క్రాఫ్టులకి చెందిన వారందరికీ ఇష్టుడిగా మారారు. వెండి తెర తో పాటు బుల్లితెర పైన కూడా అయన అనేక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో భాగంగా మారి తెలుగు టీవీ రంగంలో కూడా ప్రతేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
స్వతహాగా ముక్కుసూటి మనస్తత్వం కలిగిన నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పే కొన్ని విషయాలు యువకులకు ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ఛానల్లో ఇటీవల కాలంలో ప్రారంభించిన “మనీ సిరీస్ ” ప్రోగ్రామ్ ప్రేక్షకులకి ఆర్ధిక అంశాల మీద అద్భుతమైన అవగాహన కలిగించే విధంగా వుంది.