సెల్ ఫోన్ పేలే ముందు ఇచ్చే సంకేతాలు !!

స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ, వాటి వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి సెల్ ఫోన్ తో గేమ్ ఆడుతున్నప్పుడు , పాటలు వింటున్నప్పుడు ఫోన్లు పేలాయి అనే వార్తలు చాలానే చూశాం…

ఇలా సెల్ ఫోన్లు తరచూ ఎందుకు పేలుతాయి ?

సెల్ ఫోన్ల బాటరీ తయారీలో లోపలు, వాడకం లో చేసే పొరపాట్లు రెండు కారణమే అంటున్నారు నిపుణులు. ఫోన్ పేలటానికి చేయడానికి ప్రధానమైన కారణం అందులోని బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీలతో ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ప్రపంచంలో ఉపయోగంలో ఉండే సెల్ ఫోన్ల లో అధిక శాతం ఈ బ్యాటరీలను ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. వీటిలో లిథియం తో పాటు ధన క్యాథోడ్లు, రుణ అయాన్లు ఉంటాయి. ఈ రెండింటిని వేరు చేస్తూ కర్బన ద్రవం ఎలెక్ట్రోలైట్ ఉంటుంది. ధన, రుణ అయాన్లు ఒక దానితో ఒకటి తాకి రసాయన చర్య జరిగి పేలుడు సంభవిస్తుంది, అందుకే ఈ రెండింటిని ఎలక్ట్రోలైట్ లతో వేరు చేస్తారు. బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆయన లో ఉన్న అన్ని ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఛార్జింగ్ ప్లగ్ తీసివేయగానే అవి విధ్యుత్ ని రెండు వైపులా ప్రసారం చేస్తాయి. క్యాథోడ్, యానోడ్ ల మధ్య కర్బన ద్రవంలో లిథియం కదులుతూ ఉంటుంది. క్విక్ ఛార్జింగ్ పద్దతిలో ఛార్జ్ చేసినప్పుడు అధిక వేడి ఉత్పత్తి అయ్యి యానోడ్ పై లిటియం పేరుకుపోతుంది, దాని వాళ్ళ షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది అని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయానికి చెందిన నిపుణులు తెలిపారు. బ్యాటరీలు ఓకే నిర్దిష్ట వోల్టాజి వద్ద ఛార్జ్ చేసేట్లు రూపొందిస్తారని, అలాకాకుండా క్విక్ చార్జర్లతో వేగంగా ఛార్జ్ చేయటానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరుగుతుందని తెలిపారు.

కొందరు ఫోన్ ను ఛార్జింగ్ లో పెట్టేసి అలా వదిలేస్తుంటారు. అప్పుడు ఛార్జింగ్ పూర్తి అయిన తర్వాత కూడా విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. అయాన్లలో విద్యుదావేశం పెరిగి వేడెక్కి మండిపోతుంది. బ్యాటరీలకి తగినట్లుగానే వాటి చార్జర్లను తయారు చేస్తారు. ఫాంతో పాటు వచ్చిన చార్జర్ కాకుండా వేరేవి వాడినప్పుడు వోల్టాజిల్లో వచ్చే తేడాలవల్ల కూడా బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు జరుగుతాయని తెలియచేశారు. ఇంతే కాకుండా ఫోన్ కింద పడ్డప్పుడు దానిలోని బ్యాటరీ దెబ్బ తినొచ్చు . అప్పుడు బ్యాటరీ లోపలి భాగాల్లో చీలికలు ఏర్పడిన లేదా అమరికలో మార్పు వచ్చినా షార్ట్ సర్క్యూట్ జరగవవచ్చు. నాణ్యత లేని బ్యాటరీలు వాడినా ప్రమాదాలు జరగవచ్చు.

ప్రమాదాల్ని ముందుగా గుర్తించవచ్చా ?

అవును గుర్తించవచ్చు,,, అని నిపుణులు చెప్తున్నారు. బాటరీ పనిచేయకపోవటానికి ముందు కానీ, పేలటానికి ముందు కానీ అది ఉబ్బుతుందని అంటున్నారు. అయితే అన్ని సార్లు ఇలా జరగక పోవచ్చని, కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కన్పించకుండానే ప్రమాదాలు జరగవచ్చని అంటున్నారు. బ్యాటరీ ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే ఫోన్ నుంచి తొలిగించటం మంచిది.

అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు..

– 100% ఛార్జింగ్ పూర్తి అయినా వెంటనే చార్జర్ తొలిగించాలి.
– ఎప్పుడైనా ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే కొంత సేపు ఫోన్ వాడకుండా ఉంటే మంచిది.
– ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్ మాట్లాడటం, పాటలు వినటం, గేమ్స్ ఆడటం చేయకూడదు.
– బ్యాటరీ ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే ఫోన్ నుంచి తొలిగించటం మంచిది.
– ఫోన్ తో పాటు ఇచ్చిన ఛార్జెర్ మాత్రమే వాడాలి.
– నిద్రిస్తున్నపుడు ఫోన్ దూరంగా ఉంచాలి.
– బ్యాటరీ మార్చాల్సి వచినప్పుడు ఒరిజినల్ బ్యాటరీని మాత్రమే ఉపయోగించాలి

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here