మెగాస్టార్.. సామాన్య కానిస్టేబుల్ ఇంట్లో నుంచి వచ్చిన కొణిదెల శివశంకర వరప్రసాద్.. మూడున్నర దశాబ్దాలుగా తెలుగు తెరను ఏలుతూనే ఉన్నాడు. తానొక దుర్గం.. తానోక అనితరసాధ్యం.. అన్నట్టుగా అంచలంచెలుగా ఎదిగాడు. నెంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.. 30 ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్నాడు. స్టార్‌లు ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. మెగాస్టార్ మాత్రం ఒక్కడే ఉంటాడు.. అది చిరంజీవి అవుతాడంటూ తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా మెగాస్టార్‌కు అంతటి గౌరవ ఇచ్చారు. చిరంజీవి కూడా తాను ఎంతలో ఉండాలనేది అర్ధం చేసుకుని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటాన్ని అనుసరిస్తున్నారు. తన ఇంటి నుంచి వచ్చిన వారసులకూ అదే చెబుతున్నారు. కరోనా క్రైసిస్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లాదిరూపాయలతో సినీ రంగ కార్మికులకు ఆకలి తీర్చారు. ఇప్పుడు అన్‌లాక్ 5.0 తో సినిమా థియేటర్లు తెరుస్తారా! లేదా అనేది సందిగ్థతగా మారింది.
ఒకవేళ కొద్దినెలల తరువాతైనా.. థియేటర్లు తెరిస్తే.. వచ్చే తొలి స్టార్ హీరో సినిమా ఏమిటో తెలుసా! ఎస్.. మీరు ఊహించింది కరెక్టే.. ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో మే లోనే పూర్తికావాల్సిన ఆచార్య కాస్త ఆలస్యమైంది. ప్రొడక్షన్ దశలో ఆగింది. తిరిగి షూటింగ్ ప్రారంభించాలన్నా.. వరుసగా సినీ తారలు కరోనా వైరస్‌కు గురికావటంతో ఆచితూచి స్పందిస్తున్నారు. ఒకవేళ ఆచార్య విడుదల ఆలస్యమైతే.. వచ్చే సినిమా కూడా మెగా కుటుంబం నుంచి వచ్చేదే. అదే వకీల్‌సాబ్. పవన్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తీస్తున్న సినిమా కాబట్టి.. చిరు గాకపోతే.. పవన్ అనేది మాత్రం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్.
నాగబాబు.. నిర్మాతగా నటుడుగా ప్రూవ్ చేసుకున్నారు. నిర్మాతగా ఆరెంజ్ సినిమా తెచ్చిన నష్టంతో కాస్త వెనుకంజ వేశారు. ఇక్కడ కూడా నాగబాబు నష్టపోవటానికి చిరంజీవి కారణమంటూ ప్రత్యర్థులు విషప్రచారం చేశారు. ఒకానొక దశలో ఆయన కూడా కుంగుబాటుకు గురయ్యారట. అటువంటి సమయంలో చిరంజీవి, పవన్ ఇద్దరూ మేమున్నామంటూ భుజంతట్టడమే కాదు. అప్పుల నుంచి బయటపడి.. సాధారణ స్థితికి వచ్చేందుకు మార్గం చూపారు. ఇప్పటికీ రెండుమూడ్రోజులు ఫోన్ చేయకపోతే వెంటనేఅన్నయ్య ఫోన్ చేస్తారా.. ఏరా! నేను ఫోన్ చేయకపోతే.. నీకేమైందంటూ మందలిస్తారంటూ చిరంజీవి లోని గొప్పదనాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గుర్తుచేసుకున్నారు. ఇంటి పెద్దగా అన్నయ్య వంటి వ్యక్తి లేకపోతే తాము ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదని కూడా మనసుల భావనలు పంచుకున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా నిలదొక్కుకోవటం.. వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిహారిక పెళ్లి కూడా త్వరలో జరగనుంది. ఇటీవలే కరోనాకు గురైన నాగబాబు త్వరగానే కోలుకుని ప్లాస్మా దానం కూడా చేసి అన్నయ్య చిరంజీవితో ప్రశంసలు అందుకున్నారు. ఎటుచూసినా.. చిరంజీవి కుటుంబం హవా తెలుగు సినీరంగంపై తనదైన ముద్ర వేసుకుంటూనే ఉంటుందనేది సినీ పండితుల అంతరంగం.