అన్నయ్య సినిమా 152 ఆచార్య టీజర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఫ్యాన్స్‌లో మాంచి హుషారునింపింది. మే 13న సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించటంతో ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానగణం. తమ్ముడు పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ పై ఇప్పటికీ ఊహకు అందని విధంగా మార్కెట్ చేరింది. టాలీవుడ్ చరిత్రలోనే కొత్త రికార్డులు ఖాయమంటూ సినీ వర్గాలు గొప్పగా చెబుతున్నాయి. పవన్ ఉంటే చాలు అనుకునే అభిమానులకు వరుసగా ఐదారు సినిమాలతో 2024 వరకూ ఖాళీ లేకుండా సినిమాలు చూసే అవకాశాన్ని ఇచ్చారు పవర్‌స్టార్. వకీల్‌సాబ్ కూడా ఈ ఏడాది వేసవిలోనే రాబోతుంది. పుష్ప దాదాపు డేట్స్ ఫిక్స్ చేశారు. ఇటీవలే వరుణ్‌తేజ్ బాక్సర్‌తో కొత్త ప్రయోగం చేసిని సినిమా విడుదల ఎనౌన్స్ చేశారు. సాయిధరమ్‌తేజ్ న్యూ మూవీ రిపబ్లిక్ కూడా అంచనాలు పెంచేసింది. ఉప్పెనతో వైష్ణవ్‌తేజ్ కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అసలు సిసలు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తేజ్ ఆర్ ఆర్ ఆర్ కూడా ఈ ఏడాదే జనం ముందుకు రాబోతుంది.. ఇలా మెగాఫ్యామిలీ నుంచి దాదాపు అరడజను సినిమాలు బాక్సాఫీసును కొల్లగొట్టబోతున్నాయి. ఫ్యాన్స్ కు 2021ను మెగానామ సంవత్సరంగా పంచబోతున్నాయంటున్నారు అభిమానులు. మంచి కథలతో వస్తున్న మెగా హీరోలందరూ హిట్ కొట్టి సినీ పరిశ్రమ ప్రతిష్ఠను మరింత పెంచాలని కదలిక టీమ్ ముందుగానే అభినందనలు చెబుతోంది.