ఈనెల 13న విశాఖపట్నం తెన్నేటి పార్క్ దగ్గరకు కొట్టుకొచ్చిన MV MAA అనే పేరుగల బంగ్లాదేశ్ రవాణా భారీ నౌక తిరిగి ప్రయాణించేందుకు కొంతకాలం పట్టేట్లు వుంది . ఈ నౌక సముద్రం లో యాంకర్ తో విడిపోయి బలమైన గాలుల ధాటికి ఒడ్డుకి కొట్టుకొచ్చింది. ఇందులో 41,000 లీటర్ల ఆయిల్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఒడ్డుకు కొట్టుకొచ్చే సమయంలో నౌక అడుగు భాగం దెబ్బతిన్నట్లుగా బంగ్లాదేశ్ నౌక నిపుణులు చెప్తున్నారు. దీనిని సరి చేయకుండా సముద్రం లోకి పంపితే అందులోని ఆయిల్ లీక్ అయ్యి సముద్రంలో కలిసి పర్యావరణానికి ముప్పు వాటిల్లె అవకాశం ఉన్నందున బాంగ్లాదేశ్ నౌక సంస్థ ప్రతినిధులు స్థానికనౌక నిపుణలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండియన్ నేవీ చేప్పింది. ఇది ఇలా ఉండగా ఈ నౌకను చూడటానికి వందల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు, వీరిని కట్టడి చేయటానికి తెన్నేటి పార్క్ వద్ద పోలీసులను ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో సందర్శకులు దూరం నుంచే ఈ నౌకని చూసి, సెల్ఫీలు తీసుకుంటున్నారు.