బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమాపై టాలీవుడ్లో ఎన్నో అంచనాలున్నాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు ఇద్దరూ తెగ ప్రయత్నిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్‌లోనూ ఈ కాంబోపై ఆసక్తి పెంచుకున్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీసిన సినిమాల నుంచి.. ఇప్పటి వరకూ బాలయ్యకు ఆశించినంత హిట్ దక్కలేదు. ఎన్నో అశలు పెట్టుకున్న రూలర్ అనుకున్నంత హిట్ కొట్టలేకపోయింది. అందుకే.. ఈ సారి బోయపాటి శ్రీను కథ ఎంపికలోనూ కొత్తగా ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ కోసం హీరో నిఖిల్‌ను నటించమని కోరారట. అయితే.. ఇప్పుడే మాస్ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న నిఖిల్ సున్నితంగా తిరస్కరించారట. ప్రతి నాయకుడి పాత్ర చాలా బీభత్సంగా ఉండటం వల్లనే నో చెప్పానంటూ బదులిచ్చారట . కానీ.. హీరో, విలన్ ఏ పాత్ర అయినా రాజమౌళి, వినాయక్‌ల తరువాత బోయపాటి అదే స్థాయిలో చూపగలరనే పేరుంది. హీరో ఆదిని.. తొలిసారి విలన్ షేడ్‌లో సరైనోడులో చూపించిన బోయపాటి హీరో అల్లు అర్జున్‌కు ధీటుగా ఆది పాత్రను సృష్టించి మంచి గుర్తింపు తెచ్చారు. మరి ఈ పాత్ర ఎవరిని వరిస్తుందనే బోయపాటికే తెలియాలి.