బ్రహ్మానందం.. తెలుగుసినిమాలో హాస్య చక్రవర్తి. పేరు వింటే చాలు. ముఖంపై నవ్వులు వికసిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు మనసుకు కష్టం వచ్చినపుడు.. ఒత్తిడికి గురైనపుడు.. బ్రహ్మానందంతో మాట్లాడుతూ వాటి నుంచి బయటపడతారట. కింగ్ నాగార్జున జేబులో బ్రహ్మానందం ఫొటో ఉంటుందనే ప్రచారమూ లేకపోలేదు. వెండితెరపై నవ్వుల రారాజు బ్రహ్మానందం అద్భుతమైన చిత్రకారుడు. అధ్యాపకుడుగా అనర్గళంగా మాట్లాడగల ఆయన ఆల్‌రౌండర్ కూడా. ఇటీవల గుండెకు ఆపరేషన్ తరువాత ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవల 42 రోజుల పాటు కష్టపడి.. తిరుమల శ్రీవేంకటేశ్వరుని చిత్రం గీశారు. ఎంతో దీక్షతో.. ఏకాగ్రతతో బాలాజీ రూపానికి ప్రాణంపోశారు. అల్లు అర్జున్ ఆ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు.