జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం – ప్రెస్‌క్ల‌బ్ డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో మంత్రి కేటీఆర్‌

ప్రెస్ క్లబ్ హైదరాబాద్ రూపొందించిన 2020 21 నూతన సంవత్సర డైరీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి  కె. తారక రామారావు ఆవిష్కరించారు.  హైదరాబాద్ ప్రగతి భవన్ లో శనివారం నాడు మంత్రి కేటీఆర్ డైరీ విడుదల చేశారు . మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రెస్ క్లబ్ కు అన్ని విధాలుగా  ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ప్రెస్ క్లబ్హైదరాబాద్ అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి బి .రాజమౌళి చారి, ఉపాధ్యక్షులు లావేటి వేణుగోపాల నాయుడు ,సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, జాయింట్ సెక్రెటరీ కంబాలపల్లి కృష్ణ  సభ్యులు వీర‌గోని రజినీకాంత్ గౌడ్, కట్టాకవిత ,యశోద ,ఉమాదేవి ,భూపాల్ రెడ్డి లు  కేటీఆర్ కు మొక్కలను అందజేసి సత్కరించారు .ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఆర్ .శైలేష్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి వారి అభివృద్ధి కోసం  ముఖ్యమంత్రి   కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.

Previous articleబ్ర‌హ్మానందుడు గీసిన వేంక‌టేశ్వ‌రుడు!
Next articleకొడాలి.. చంద్రబాబు కోవర్ట్ అనిపిస్తుంది.! || An Analysis by Tati Rama Krishna Rao On Recent Politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here