రికార్డులు ఆయనకు కొత్తేం కాదు.. రికార్డులను బద్దలు కొట్టడం మెగా ఫ్యామిలీకు తెలియనది కాదు. అన్నీ ఉన్న ఆకు అణిగే ఉంటుదనేది మెగా బ్రదర్స్ విషయంలో అక్షరసత్యం. ఎవరెన్ని అడ్డంకులు పెట్టిన భజన నానిలు బోరు మని ఏడ్చినా పవర్ స్టార్ ఇమేజ్‌ను దెబ్బతీయలేదని మెగా ఫ్యాన్స్. జనసైనికులు రుజువు చేశారు. ఒక్క షో కాదంటే.. పదిసార్లు సినిమా చూస్తామంటూ వీర మహిళలు కదలటమే వకీల్‌సాబ్ విజయానికి కారణం. ఇవన్నీ విన్న పవన్ నా సినిమా ఒక్కటే కాదు… తెలుగు తెరపై రిలీజ్ అయ్యే ప్రతిసినిమా బాగా ఆడాలి.. బాగా డబ్బులు రావాలని ఆశించే గొప్ప మనసు ఇంకెవరికి ఉంటుంది. వకీల్‌సాబ్ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మూడేళ్ల తరువాత సినిమా.. ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు. పైగా పవన్ అభిమానులు.. ఆతృతగా ఎదురుచూస్తు.. ఆకలిగా ఉన్న వాడికి హైదరాబాద్ బిర్యానీ చేతికిస్తే ఎలా ఉంటుందో వకీల్‌సాబ్ మెగా ఫ్యాన్స్‌కు అలా మారింది. పేటిఎం బ్యాచ్ కొందరు సినిమాను అడ్డుకోవాలని.. పవన్ వ్యక్తిగత జీవిత బయటకు తీసి ఆనంద పడిన వైరివర్గం సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో నవ్వులపాలైంది. ఫ్యాన్స్ కూడా చాలా సంయమనం పాటించారు. గాంధీగిరి ద్వారా నాలుగు సార్లు సినిమా చూసి సత్తాచాటారు. భజన బ్యాచ్‌కు దమ్ముచూపారు. దాని ఫలితంగానే వారం రోజుల ముందుగానే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది పెద్ద నిర్మాత దిల్ రాజు కూడా తన ను తాను మరచిపోయి మామూలు ప్రేక్షకుడుగా మారానంటూ చెప్పారు. మూడేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి అదే వాడి.. అబ్బే ఏం తగ్గలే. గ్రేస్ పవర్ స్టార్ చుట్టూ వైఫైలా ఉంటుందంటే ఇదే.
తమ్ముడి నటన విశ్వరూపంపై అన్నయ్య మెగాస్టార్ స్పందిచా రు. కోర్టు సీన్‌లో జరిగిన డ్రామా పై ప్రశంసలు కురిపించారు . పైగా సినిమా ద్వారా మహిళలకు ఇచ్చిన గౌరవం.. అంటూ చిరు ట్వీట్ చేసి మెగా ఫ్యాన్స్ కు మనసు ఖుషీ చేశారు.
Power Star never loose his power in telugu movie industry…Pavan means a wind..No one can stop wind…