2018లో ఎమ్మెల్యేగా ఓడినా 2019లో కరీంనగర్ ఎంపీగా నెగ్గారు. 2020లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎదిగారు. గ్రేటర్ ఎన్నికల్లో కాక పుట్టిస్తున్నారు. ఇంతకు మించి బండి సంజయ్ గురించి ఏం చెప్పాలంటారు అభిమానులు. బండి సంజయ్ కుమార్… తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. పాతబస్తీలో రోహింగ్యాలు. పాకిస్తానీయులపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామంటూ ఏకదమ్న అటు టీఆర్ ఎస్, ఇటు ఎంఐఎంలకు వణకు పుట్టించాడు. ఇది నిజమని అంగీకరించలేక… అబద్దమని ఖండించలేక రెండు పార్టీలు విలవిల్లాడుతున్నాయి. నిజానికి హైదరాబాద్‌లో 6000 మంది రోహింగ్యాలు ఉన్నారని పోలీసులే లెక్క తేల్చారు. అక్రమంగా ఆధార్‌కార్డులు, ఓటరు ఐడెంటీ కార్డులు పొందారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నారు. పోలీసులు కూడా 60 మందిపై కేసులు కట్టారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సంజయ్ గురిచూసి కొట్టాడు. సంజయ్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు చేస్తున్నా.. దానికి కారణాలు ఉండటంతో ఎటూ పాలుపోని స్థితికి చేరిన ప్రత్యర్థులు ఆత్మరక్షణలో పడ్డారు. అందుకే.. వరద సాయం అడిగితే ఇవ్వలేదని. మేనిఫెస్టోలో బీజేపీ మేం చేసిన అబివృద్ధి ఫొటోలను వాడుకుందంటూ కేటీఆర్ సర్జికల్ అస్త్రం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజానికి సంజయ్ ఇవన్నీ యాదృచ్ఛికంగానో.. ఎమోషన్‌గానే చెప్పిన మాటలు కాదు. పక్కా వ్యూహంతో అవతలి వారిని ఇరుకున పెట్టేందుకు చేసిన విమర్శలు. ట్రాప్‌లోకి ఎంఐఎం, టీఆర్ ఎస్ రెండూ పడ్డాయి. కాంగ్రెస్ కూడా ఎటూ తేల్చుకోలేక విలవిల్లాడుతోంది. అందుకే.. ఎంఐఎం దీన్నుంచి బయటపడేందుకు హిందువుల ఓట్లను చీల్చేందుకు ఏం చేయాలో ప్రయత్నాలు చేస్తోంది. వాడి వేడి మాటలో మంటలు పుట్టిస్తున్న నాయకుడు. కరడుగట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదిగా బండిని బీజేపీ హైకమాండ్ తెలంగాణ అధ్యక్షుడుగా ఎందుకు చేసిందో ఇప్పుడిపుడే అర్ధమవుతోంది. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ హయాంలో ఎలాంటి లోపం జరిగిందో.. పార్టీ ఎందుకు వెనుబడిందనే విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన పార్టీ బండిని సరైన సమయంలో రంగంలోక దింపినట్టుగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 2016లో 4 సీట్టు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఏకంగా పీఠంపై గురిపెట్టింది. అయితే ఇదంతా అత్యాశ అనే మాట నవంబరు 18 ముందు వరకూ ఉండేది. కానీ.. నవంబరు 22న పరిస్థితి మారింది. దుబ్బాక గెలుపును ఎక్కువగా ఊహించుకుంటున్నారంటూ టీఆర్ ఎస్ లైట్‌గా తీసుకుంది. ఎంఐఎంతో సంబంధం లేకుండానే 90 సీట్లు గెలిచి తీరుతామనే భావనలో ఉంది. కానీ.. వరదసాయంలో 500 కోట్ల రూపాయల్లో 300 కోట్లు సొంతోళ్ల ఖాతాల్లోకి చేరాయలనే విషయం జనం గ్రహించారని తెలిసాక ఎటు పాలుపోని పరిస్థితికి చేరింది. అదే సమయంలో బండి సంజయ్ ఎంఐఎంను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలు.. టీఆర్ ఎస్పై ఎదురుదాడితో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కమలం శ్రేణుల్లోనూ మాంచి ఉత్సాహం వచ్చింది. కొడితే ఇప్పుడే పీఠం కొట్టాలి. ఇప్పుడు తప్ప మరో ఛాన్స్ లేదనే భావనకు వచ్చారు. ఒక్కసారిగా స్టార్ క్యాంపెయినర్‌గా బండి మారిపోయారు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ఏకంగా నరేంద్రమోదీ వస్తున్నారనే సమాచారంతో మరింత హీట్ పెంచినట్టయింది. అయితే.. ప్రధాని మోదీ కేవలం కొవాగ్జిన్ కరోనా టీకా పరిశీలనకు వస్తున్నారనేది సమాచారం. ఏమైనా.. హైదరాబాద్ ప్రధాని రావటం బీజేపీ శ్రేణులకు మాంచి ఊపు తెచ్చినట్టయింది. ఏమైనా.. సంజయుడి అస్త్రం శత్రుశిభిరాలను కకావికలం చేసింది.