దొంగలందు వింతదొంగలు వేరయా ! అన్నట్టుగా ఉంది. షాపుల్లోకి దూరి చీరలు, నగలు కొట్టేసే మాయా లేడీలు. బస్సుల్లో పర్సులు, నగలు కాజేసే కిలేడీలను చూశాం. కానీ హైదరాబాద్ లో మహిళ భిన్నంగా ఆలోచించింది. వింత దొంగగా మారారు. అదెలా అంటారా.. ఎస్.ఆర్నగర్ సమీపంలో బల్కంపేట ఐడియా ఉంది కదూ.. ఆ చుట్టు పక్కల ఇళ్లలో కొద్దికాలంగా చోరీలు జరుగుతున్నాయి. అవి ఏమిటంటారా.. ఇంటి ఎదుట అందం కోసం అమర్చుకున్న పూల కుండీలు, తులసిమొక్కలు ఎవరో కొట్టేస్తున్నారట. ఆకతాయిల పనిగా భావించినా ఇదంతా ఓ మహిళ చోరురాలు ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా కనిపెట్టారట. అది కూడా అందరూ గాఢనిద్రలో ఉండగా.. తెల్లవారుజాము సమయంలో అదను చూసి కుండీలను కొట్టేస్తుందట.ఇప్పుడు ఆమె ఎవరో తెలుసుకునేందుకు పోలీసులతోపాటు. స్థానికులు కూడా వెతుకులాట మొదలుపెట్టారట.



