ఆమె ఇబ్బందికి.. షీ (ఈ)-టాయిలెట్ ప‌రిష్కారం!!!

బ‌య‌ట‌కు వెళ్లేముందు చాలా మంది గృహిణులు మంచినీళ్లు ఎందుకు తాగ‌‌రనేది మీలో ఎంత‌మందికి తెలుసు?

పాఠ‌శాలకు వెళ్లే ఓ విద్యార్ధిని దాహంతో నాలుకు ఎండిపోతున్నా అలాగే ఎందుకు ఉంటుంది?

భార‌త‌దేశంలో యూరిన‌రీ ఇన్ఫెక్ష‌న్లతో ఎక్కువగా మ‌హిళ‌లే ఇబ్బంది ప‌డ‌తారెందుకు?

దీనంత‌టికీ స‌మాధానం.. బాత్రూమ్ స‌మ‌స్య‌. బ‌య‌ట‌కెళితే.. మూత్ర‌శాల‌లు ఎక్క‌డ ఉంటాయో తెలియ‌దు. ఒక‌వేళ వెళ్లాల‌ని ఉన్నా చుట్టూఉన్న వారు ఏమ‌నుకుంటార‌నే బిడియం. మ‌గువ‌ల‌కు స‌హ‌జంగా ఉండే ఇటువంటి భ‌యాల‌తో బ‌య‌ట‌కు వెళ్లేముందు మంచినీళ్లు తాగ‌టం మానేస్తున్నారు. పాఠ‌శాల విద్యార్థినులు కూడా ఇంటికి వ‌చ్చేంత వ‌ర‌కూ బిగ‌ప‌ట్టుకుంటున్నారు. ఇవ‌న్నీ చాలా సున్నిత‌మైన స‌మ‌స్య‌లు. చాలి చిన్న‌దిగా క‌నిపించే అంశంలో మ‌హిళ‌ల ఆరోగ్య స‌మ‌స్య కూడా ఉంది. మూత్ర‌నాళ స‌మ‌స్య‌లు.. మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా రావ‌టానికి కార‌ణం.. త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌టం.. అపరిశుభ్ర వాతావ‌ర‌ణంలో మూత్ర‌విస‌ర్జ‌న‌. తొలిసారి భ‌ర్త‌తో క‌ల‌సి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం వ‌చ్చిన గృహిణి.. మూత్ర ఇబ్బందితో ఎంత‌గా ఇబ్బంది ప‌డుతుంద‌నేది ఆ ఆలుమ‌గ‌ల‌కు మాత్ర‌మే తెలుస్తుంది.

ఇంత‌టి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌నుకుంది.. ఓ నారీమ‌ణి. మాట‌లు కాదు. చేత‌ల ద్వారా దాన్ని సాధించి ఔరా అనిపించారు. స్వ‌చ్ఛ‌భార‌త్ అంటే.. నిజ‌మైన అర్ధం చూపారామె.

కోదాడ ప్రాంతానికి చెందిన సుష్మా కల్లెంపుడి 15 సంవ‌త్స‌రాలు అమెరికాలో ఉన్న‌త కొలువులో ఉన్నారు. రెండేళ్ల క్రిత‌మే తెలంగాణకు తిరిగొచ్చారు. భర్త తో కలిసి సామాజిక సేవలో పాల్గొంటుంది. అమెరికా, ఇంగ్లాండ్ మరియు కెనడా లో అనేక
సాఫ్ట్‌వేర్ కంపెనిల్లో పనిచేసిన అనుభవం తో మాతృ దేశానికి సేవ చెయాలన్న సంక‌ల్పించారు. మహిళల గౌరవానికి సంబందించి సరికొత్త టెక్నాలజి తో మొబైల్ షీ -టాయిలెట్ నిర్మాణం లో నిమ‌గ్న‌మ‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం తో మరింత ముందుకు వెళ్లాల‌నే త‌లంపుతో ప‌నిచేస్తున్నారు. సంక‌ల్పం బ‌లంగా ఉంటే.. ప్ర‌య‌త్నంలో విజ‌యం చేకూరుతుంద‌నే విశ్వాసం వ్య‌క్తంచేస్తున్నారు సుష్మా.

తను చదువుకునేటప్పుడు, ఆ తర్వాత హైదరబాద్ లో ఉద్యొగం చేసెటప్పుడు రద్ది ప్రాంతాల్లో టాయిలెట్లు లేక మహిళలు పడుతున్న‌ ఇబ్బందులు చూసి బాధ‌ప‌డేది. కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తున్న కూడ కనీసం శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవటం ఆమెను ఆలొచనలో పడేసింది. అదే సమయం లో ఫంక్షన్లు జరిగినపుడు, బస్టాండ్ లలో, రైల్వేస్టేష‌న్ల‌లో టాయిలెట్లు కూడా శుభ్రత పాటించటం లో నిర్లక్ష్యం వహించటం గ‌మ‌నించారంటారామె.


హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రభుత్వ ఆద్వర్యం కోట్ల రూపాయలతో నిర్మించిన టాయిలెట్లు 90శాతం వరకు సరైన మెయింటనెన్స్ లేక ఉపయోగించ‌లేని దుస్థితిలో ఉంటాయి. చాలా చోట్ల ప్ర‌జ‌లు కూడా చాలా నిర్ల‌క్ష్యంగా వ‌దిలేస్తుంటారు. ప్రయివేట్ సంస్థ అయిన సులభ్ ఇంటర్నెషనల్ లో కూడ మహిళలు టాయిలెట్ కు వెళ్లేందుకు కొంతవరకు తటపటాయిస్తుంటారు.

ఈ నేపధ్యం లో సుష్మా అలోచనలతో పురుడుపోసుకున్న మొబైల్ షీ -టాయిలెట్ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దశలో ఉంది. అగ‌స్టు 20 న సూర్యాపేట్ జిల్లాలోని కోదాడ మునిసిపాలిటి ఆధ్వర్యం లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. విదేశాల్లో ఎంతో శుభ్రంగా ఉంచె టాయిలెట్లను చూసి అదే తరహాలో ఎలెక్ట్రిసిటి తో నడిచి, తక్కువ నీటిని ఉపయోగించే మొబైల్ టాయిలెట్లను మహిళ ల కోసం నిర్మించే పనిలో సుష్మా బిజిగా ఉన్నారు.

తెలంగాణ మొబైల్ షీ -టాయిలెట్ ప్రత్యేకతలు:

ఎలక్ట్రిక్ వెహికిల్ లో మొబైల్ టాయిలెట్ ఫిక్స్ చేసి స్వచ్చ తెలంగాణ లో భాగం కావాలని సుమారు 5 లక్షల అంచనాతో “తెలంగాణ మొబైల్ షీ -టాయిలెట్” డిజైన్ చేయటం జరిగింది.
ఇబ్బందుల‌కు అడ్డుక‌ట్ట‌
– రద్దిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు టాయిలెట్ సౌకర్యం కల్పించటం, పెట్రొల్ బంక్ యజమానుల సహకారం సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, చార్జింగ్ సదుపాయం కల్పించటం .
– నిరుద్యొగ యువతకు ముఖ్యంగా మహిళలకు ఉపాధి మరియు ఆదాయం, అవసరమైతే ప్రభుత్వ సబ్సిడి తో ప్రొత్సహించటం.
– ఒకే దగ్గర ఫిక్సెడ్ గా ఉండకపోవటం తో క్లీనింగ్ సమస్యలకు, డ్రైనేజ్ సమస్యలకు దూరం.
– ఎలెక్టిక్ వెహికిల్ ఉపయొగించటం వల్ల కాలుష్య రహిత వాతవరణం కు సహయపడటం
– తక్కువ నీటితో టాయిలెట్లు వాడె ఇజ్రాయిల్ దేశం టెక్నాలజి వాడటం
-మహిళలకు అవసరం సానిటరి నాప్కిన్లు అందుబాటులొ ఉంచటం
– చేతులు కడిగిన వాటర్ నే మల్లి తిరిగి వాడే విధానం లో వాష్ బెసిన్ నిర్మాణం.
– ఒకసారి టాయిలెట్ వాడితే సుమారు 6 నుండి 8 లీటర్ల నీరు వాడటం జరుగుతుంది. కొత్త విధానం (వ్యాక్యుం వాటర్ సేవింగ్) ప్రకారం అర లీటర్ మాత్రమే వాడటం జరుగుతుంది.
– పట్టణాలలో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడ ఉపయొగం.
– అందుబాటులో ఫస్ట్ ఏయిడ్ మెడికల్ కిట్స్ ఉంచటం


నిర్మాణం:
-మొబైల్ ఎలెక్ట్రిక్ చార్జింగ్ వ్యాన్, వాటర్ సేవింగ్ టాయిలెట్, చార్జింగ్ స్టేషన్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ స్టేషన్, వాటర్ సప్లై స్టేషన్, శానిటరి నాప్కిన్ వెండింగ్ స్టేషన్.

ప్రతిపాదనలు:
– స్వచ్చ తెలంగాణ కింద తెలంగాణ ప్రభుత్వం కు ప్రతిపాదనలు పంపగా వారు అభినందించి ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావటానికి ఆసక్తి చూపారు.
– ప్రముఖ ఐ.టి. కంపెనీలు కూడ ఆసక్తి చూపి మరిని వివరాలు అడిగారు.

సహకారం:
పూణె లో ఇప్పటికె అందుబాటులో ఉన్న టి-బస్ టాయిలెట్ సంస్థ తో సంప్రదింపులు, సెప్టిక్ టాంక్ క్లీనింగ్ మరియు వాటర్ సప్లై కోసం అధునాతన టెక్నాలొజి కంపనిల సహకారం, షీ టాయిలెట్ కోసం పూర్తిగా అనువైన ఎలెక్ట్రిక్ వ్యాన్ డెజైన్ చేసే చైనా మరియు స్వదేశి కంపెనిల సహకారం తీసుకోనున్నారు.

పెట్టుబడులు:
ఇప్పటికే కొన్ని ప్రభుత్వ మరియు ప్రయివేట్ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.

వినియోగం:
ఇప్పటికే ఆలోచన, మాన్యుఫాక్చరింగ్ స్టేజి నుండి పైలట్ ప్రాజెక్ట్ వరకు వచ్చిన షీ -టాయిలెట్ త్వరలోనే మరింత వినియోగం లోకి రానుంది. సుమారు 100 వాహనాలతో మొదటి బ్యాచ్ 2021 సంవత్సరం మొదటి మూడు నెలల్లో తెలంగాణ లోని హైదరాబాద్ సహ ఇతర పట్టణాలలో అందుబాటులోకి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here