తన నృత్యం లో మహత్యం ఉంది,
మహత్తర సాధన దాగుంది
తన అభినయంతో అందర్నీ తాళ్ళులేకుండానే కట్టి పడేసే కళా నైపుణ్యం ఉంది,
నాట్యరంగంలో ప్రభలా వెలిగిన శోభానాయుడు మనమద్య లేరనే చేదునిజాన్ని యావత్ ప్రపంచం జీర్ణించుకోలేక పోతుంది.
నేను రాసిన కవిత కు ఫిదా అయ్యారు… ముగ్ధులయ్యారు…
శోభమ్మా..కూచిపూడి నృత్యానికి పట్టుగొమ్మ.
మొన్న బాలు గానం, ఈరోజు శోభ నటనం, .దివికేగాయి..దేవతలకు పండుగోయి..
— బొమ్మిన వెంకట రమణ, సినీ మాటల రచయిత
(మీ జ్ఞాపకాన్ని కదలికతో పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు)