వైరస్ వల్లే ఈ ” రిస్క్ “

కీర్తి క్రియేటివ్స్ బ్యానర్ పై ఎస్. పీ పవన్ కుమార్ దర్శకత్వం లో రిస్క్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో హరి చరణ్ , లౌక్య హీరో హీరోయిన్లు. ఒక వైరస్ పై పరిశోధనలు స్వార్ధపూరితమైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే కధాంశంతో ఈ సినిమా రూపొందింది. దర్శకులు ఇది అందర్నీ ఆకట్టుకునే ఓ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. ప్రముఖ నటులు రాళ్ళపల్లి, ప్రసన్న కుమార్, రమాదేవి, కె.ఏ పాల్ గా చేసిన రాము, శివ సత్యనారాయణ ఇందులో నటీనటులు. ఛాయాగ్రహణం – రమేష్ తిరుపతి. , మ్యూజిక్ – మేఘశ్యాం ఆచార్య .కధ – కధనం – దర్శకత్వం – ఎస్.పీ పవన్ కుమార్ – నిర్మాత – పరిమళ

దర్శకుడు మాటాడుతూ ” వైరస్ — ప్రపంచంలో ఎక్కడో ఒకచోట పుడుతూనే ఉంది.. మానవాళి మనుగడకి ప్రతిసారి ఓ ఛాలెంజ్ విసురుతూనే ఉంది.. అలాంటి వైరస్ కి విరుగుడు కనుక్కునే ప్రయత్నం నిస్వార్థంగా జరగాలి .. కానీ దానికి వాక్సిన్ కనుక్కునే నేపథ్యం స్వార్థపూరితమైతే పరిణామాలు ఎలా ఉంటాయి … ఈ కాన్సెప్ట్ కి ప్రేమ ని జోడిస్తే …అదే ఈ సినిమా … హైలెట్స్- మేకింగ్.. దాదాపు 40 లొకేషన్స్ లో కాంప్రమైజ్ కాకుండా తీసిన స్టోరీ ఇది.. హైదరాబాద్ , గోవా లలో చిత్రీకరించాం ..
హీరో ఈవెంట్స్ చేసే నేపథ్యం చాలా రిచ్ గా తీసాం.

రిస్క్ చేసి , గణపతి నిమజ్జనం జరిగే ప్లేస్ లో 3 కెమెరాలతో షూటింగ్ చేసాము..
ఛానల్ సెట్స్ కొన్నిచోట్ల వేసి తీసుకున్నాము. పేరున్న పెద్ద నటులు అని కాకుండా మా కాన్సెప్ట్ కి ఎవరు సరిపోతారో వాళ్ళతో షూట్ చేసాము .సాంగ్స్ విసువల్ ఫీస్ట్ లాగా ఉంటాయి.. మంచి టెక్నిషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేసారు.. ఒక డైరెక్టర్ గా నాకు 2 సినిమాలు వర్క్ చేసిన అనుభవంతో పాటు, మీడియా రంగం లో ప్రముఖ చానెల్స్ లో 19ఏళ్ళ అనుభవం ఉంది..గజినీ సినిమా కి ఆపరేటివ్ కెమెరా మాన్ గా చేసిన రమేష్ తిరుపతి అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించాడు.. సాంగ్స్ మ్యూజిక్ ఇచ్చిన మేఘశ్యాం ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్ . రెహమాన్ దగ్గర దాదాపు 3ఏళ్ళు పనిచేసాడు.. ఆర్టిస్టులు – చరణ్ – హీరో , లౌక్య – హీరోయిన్ రాళ్ళపల్లి , ప్రసన్నకుమార్ , రమాదేవి , శివ సత్యనారాయణ , జాన్వీ, ముకేశ్ .. ఇంకా చాలామంది నటీనటులు.. ఈ నటులు ఇప్పటికే చాలా సినిమాలు చేసి ఉన్నారు..” అని చెప్పారు.

ఈ సినిమా OTT ప్లాట్ ఫార్మ్స్ మీద ఇప్పటికే రిలీజ్ అయ్యింది .

https://watch.amazon.com/detail?asin=B08PC7Z4NS&territory=US&ref_=share_ios_movie&r=web

Previous articleఅప్డేట్ అవ్వటమే అసలైన అస్త్రం
Next articleబీజేపీ గెలుపున‌కు మార్గ‌మేస్తున్న గులాబీ నేత‌లు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here