అప్డేట్ అవ్వటమే అసలైన అస్త్రం

అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది..అనేది సినిమా డైలాగే అయినా ఇప్పటికి సరిగ్గానే సరిపోతుంది.2021 లో కరోనాతో జరుగుతున్న మూడో ప్రపంచ యుద్ధం ముగిసే అవకాశం ఉన్నా, యుద్ధానంతర స్థాయి పరిస్థితులైతే ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఆర్ధికవ్యవస్థ మాంద్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. తత్పరిణామాల దృష్ట్యా దేశంలో సామర్ధ్యానికి తగిన స్థాయిలో ఉత్పత్తి చేయలేని పరిస్థితులు ఏర్పడవచ్చు, అనంతర పరిణామాల్లో పెరిగిన ఋణ భారం, ఖర్చులు తగ్గించుకునే క్రమంలో స్థిర ఖర్చులు ( Fixed cost) తగ్గించుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యాన్నిస్తాయి, అందులోనూ అధిక అనుభవం, అధిక వేతనాలు కలిగిన వారిపై
ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 15 సంవత్సరాల అనుభవం కలిగిన ఉద్యోగికి పదిలక్షల సంవత్సరాదాయం ఉంటే, అతని స్థానంలో అదేపనిని కేవలం 5 లేదా 6 సంవత్సరాల అనుభవం కలిగిన యువకులతో భర్తీ చేయడం.

ఏం చేయాలీ….!!

టెక్నాలజీ ఇంకా వృత్తినైపుణ్యత ప్రాధాన్యాంశాలు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం ఎక్కువగ ఉండొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.ఉద్యోగి తమ వృత్తికి సంబంధించి సాంకేతికతలో నైపుణ్యత సాధించడం అతి ముఖ్యమైన విషయం
ఉదాహరణకు ఒక సివిల్ ఇంజినీర్ ETAB లేదా Revit వంటివి..ఒక చార్టెడ్ అకౌంటెంట్ SAP లాంటి E R P వంటివి లేదా Tableu, Power Bi వంటి అనలిటికల్ డాటా విజువలైజేషన్ టూల్స్ లలో నైపుణ్యత సాధించం ద్వారా ప్రధాన్యతా క్రమంలో ముందు వరుసలో నిలవగలరు.

ఇప్పటి పరిస్థితుల్లో ట్రైనింగ్ సెంటర్లకు వెళ్లే పనిలేకుండానే Udemy, Upgrad, Unecademy, Coursera వంటి యాప్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ప్రముఖ యూనివర్సిటీలు అందించే సెర్టిఫికెట్ కోర్సులూ ఉన్నాయి, కోర్సును బట్టీ కొన్ని ఉచిత కోర్సులు కూడా అందుబాటులో ఉంచాయి.

రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (R P I), ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (A.I), హైపరాటోమేషన్, ఎక్ష్టెండెడ్ రియాలిటీ (XR) వంటి పదాలు అతిత్వరలో మన నిత్య జీవన విధానంలో భాగం కాబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here