ఒత్తిడిని జయించేందుకు ఇవిగో మార్గాలు!!!

కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరు ఒత్తిడికిలోనవుతూ , బ్రతుకుపట్లభయంతోవున్నారు. మానసికంగాఒత్తిడికిగురవుతున్నారు. నరాలుచిట్లేంతఒత్తిడికిలోనవుతున్నవ్యక్తిజీవితం నరకప్రాయంగా మారిపోతుంది. మనిషిని మనిషిగా బ్రతుకనివ్వనిది … డాక్టర్లకి అంతుచిక్కనిది …. మనిషి కాళ్లు చేతులలో దడపుట్టించేది … కొన్నిసందర్భాలలో గుండెవేగం ప్రక్కవారికి గుబులు పుట్టించేలా చేస్తుంది.. సముద్రంలోమునిగిపోటున్నట్టు , అగాథంలోకి నెట్టినట్లుగ వుంటుంది. వ్యక్తి వ్యక్తిగా తానేమిటొ తనపరిస్థితి ఏమిటో తెలియనిస్తితి … జీవితంపట్ల విరక్తిని పెంచేది మనిషిని ప్రశాంతంగా వుండనీయకుండ ఆసుపత్రుల పాలుచేస్తు …. ఆత్మహత్యలకు … రకరకాల వ్యసనాలకు గురిచేస్తున్న …. ….ఒత్తిడి …..ఒత్తిడి … స్ట్రెస్. పుట్టిన శిశువు నుండి చనిపోయెవరకు మనిషిని నీడల వెంటాడుతూవుంటుంది . ఒత్తిడి భారీప‌డ‌నివారంటూ ఎవ్వ‌రూ ఉండ‌ర‌నే చెప్పాలి. . ఒత్తిడి లేకుండా జీవించడం అసంభవం …

ఇదే మాన‌సిక ఒత్తిడిని మేనేజ్ చేసుకుంటూ జీవితాన్ని సాఫీగా న‌డిపించుకోవ‌టం కూడా చాలా తేలిక అంటున్నారు కౌన్సెలింగ్ సైకాల‌జిస్ట్ డాక్ట‌ర్ మోతుకూరి రాంచంద‌ర్‌. ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఉన్న మార్గాల‌ను వివ‌రిస్తున్నారు.

ఈ స్ట్రెస్‌(మాన‌సిక ఒత్తిడి) ఆలో చనను బట్టి దాని తీరుతెన్నులు ఆధారపడి వుంటాయి అన్నారు. ‘సాదారణంగ ‘స్ట్రెస్’ అనగా’ప్రెషర్’ లేదా ‘ స్ట్రైన్అంటారు. మనిషి శరీరంలో ఏర్పడే మానసిక మార్పులే ఈఒత్తిడిని కలుగచేస్తుంటాయి. ప్రపంచంలో ఏవ్యాధిఅయిన వైరస్, బాక్టీరియతోనో వ్యాపిస్తుంది. కాని ఈఒత్తిడిఎ లాంటి బ్యాక్టీరియా/ వైర‌స్‌తో ప‌నిలేద‌ని గుర్తుంచుకోండి.

డాక్టర్ల వైద్యానికి అంతుచిక్కకుండా మనిషిని రోజురోజుకి శుశ్కించి పోయెలా చేస్తుంది. ” మానసికంగాఒత్తిడిలేనట్లైతే ప్రేరణ కరువైపోతుంది. ఆఒత్తిడి అధికమైనచో మనిషిమనుగడ ప్రశ్నార్థకమౌతుంది. అందుకేఒత్తిడి శ్రుతిమించకుండా జాగ్రత్తపడటం ఎంతో అవసరం. ” తినేఆహారం వల్ల కడుపులోకురుపులురావు. ఈఒత్తిడి వలననే అల్సర్లువస్తాయ‌నేది వైద్య‌నిపుణుల హెచ్చ‌రిక కూడా.

” మనిషి పైబడిన డిమాండ్కు మనిషి చూపించే ప్రతిస్పందనే ” స్ట్రెస్ ”

ఉదా: పోటీపరీక్షలకి సిద్దమయ్యే విద్యార్థుల్ని ఒకసారి గమనించినట్లైతే, పరీక్ష దగ్గరపడుతున్న కొద్దిఒకటే ” టెన్షన్ “. ఇక్కడ డిమాండ్ ఏమిటంటే , పరీక్షల్లో ఎక్కువమార్కులు సాధించండం , దానికి ఎన్నో అడ్డంకులు క‌‌నినిపిస్తుంటాయి.

సిలబస్, ప్రశ్నల్నిఊహించడం, ఉద్యోగంవస్తుందోలేదో … మంచికెరీర్ ల‌భిభిస్తుందోలేదో … ఇలాఎన్నో … ఇక్కడ ఒత్తిడిని వదిలించుకున్నట్లైతే విజయంమీదే. ఈఒత్తిడి మనిషిని వెంటాడే నిజమైన భూతం. నీడలా మనవెంటేవుంటు భయపెడుతుంది. ఈ భయాన్నే ‘ త్రెట్’ అని ‘ స్ట్రెస్ ‘ అనిఅంటారు.

ఒత్తిడిరెండురకాలు

1.యూస్ట్రెస్ (Eustress ) : దీనినేపాజిటివ్ నెస్ అంటారు. వ్యక్తిని సానుకూలంగా, చాలెంజ్‌ చేస్తూ జీవితానికి స్ఫూర్తినిస్తుంటుంది . ఇది ప్రతిమనిషికి అవసరం. జీవితంలోతను పోటిపడుతూ నిలడొక్కుకొవాలంటే ఇది ఉండాలి. వ్యక్తిసంతోషంగా వున్నప్పుదు, తనకు ఉద్యోగంకాని, విద్యార్థికి కళాశాలలోసీటు పొందినప్పుదుమనలోఏర్పడే ( సైకలాజికల్రియాక్షన్) మానసికచర్యే ఈ స్ట్రెస్. ఏదైతేమనిషి ఎదుగుదలకు, మంచికి తోడ్పడుతుందో దానినే యూస్ట్రెస్అంటారు.
2. డిస్ట్రెస్:
దీనిని నెగిటివ్ స్ట్రెస్ గా చెబుతారు. ఒకమనిషిని భయకంపితుల్ని చేసి, గందరగోళ ప‌ర‌స్తూ జీవితాన్నిచిందరవందర చేస్తుంది. ఇదొక భయంకరసన్నివేశం.
ఉదా: పరీక్షల్లోఅనుత్తీర్ణులైనవిద్యార్థుల భావోద్వేగాలు, స్నేహితులతో గొడవపడడం, ఆత్మహత్యలు… ఇలాంటి మానసిక మార్పులేది స్ట్రెస్.

మనం పనిచేస్తున్న సంస్థల్లో, తనచుట్టూ వున్నసమాజంలో, మన సంస్కృతి, జీవన విధానాలతో, కులం, మతం భాషావేషాలద్వారా.. వివిధ సన్నివేశాలలో వివిధరకాలుగా ఈ ఒత్తిడి ఎదుర‌వుతుంది. ఈ వేధించే ” స్ట్రెస్సర్స్” లేదా ఒత్తిడి కారకాలు అంటారు. ఈ ఒత్తిడికి కారణాలు ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా వుంటాయి.

మీ ఒత్తిడికి
* వ్యక్తిఆలోచనవిధానం
*డబ్బుసమస్య/ ఆర్ధికఇబ్బందులు
* సమాజంలో అన్నిరంగాలలో పెరిగిన పోటి
* ద్వంద్వ ప్రమాణాల వల్ల ఏర్పడుతున్న కుటుంబ తగాదాలు
* చాలాకాలం నుండి సాఫల్యంకాని కోరికలు
* పరిస్తితులపట్ల అవగాహనలేకపోవడం, నియంత్రించడానికి ప్రయత్నిచకపోవడం.
* వంశపారంపర్య ఆరోగ్యసమస్యలు ఎక్కువకాలం ఇబ్బందికల్గించడం
” తప్పనిసరిగా ” ఇదిచేయాలి, అదిచేయాలి అనేభావన
* నగరజీవితంలో, ‘ ధ్వనికాలుష్యం, ఎల‌క్రానిక్ క్రేడియేష‌న్స్‌, మొబైల్ ఫోన్లు, కంప్యూట‌ర్లు
* సమాజంలో పెరుగుతున్ననేరాలు, కుట్రలు, మోసాలు..
* నెగెటివ్ఎమోషన్స్, అసహ్యించుకోవడం, శత్రుత్వం, భయం,వ్యాకులత, డిప్రెషన్..
* పనిఒత్తిడి, ల‌క్ష్యాలు, స‌మ‌య‌పాల‌న,

కొన్నిసాధారణ లక్షణాలు: ( Symptoms of Stress)
* ప్రతిరోజు నిద్రించడంలోసమస్య
* నిర్ణయాలు తీసుకోవడంలో , ఏకాగ్రతలోకష్టతరం
* ఎప్పుడు అలసినట్లు గకనిపించడం
* ఎప్పుడు తలనొప్పితో, కండరాలనొప్పులతో బాధపడడం
* ఎదుటివారితో మాట్లడడానికి ఇష్టపడకపోవడం
* ప్రతిచిన్నవిషయానికి కోపగించుకోవడం
* మద్యం,ధూమపానాలకు బానిసలవడం
* ” సెక్స్” పట్ల కోరికలు సన్నగిల్లడం
* ఎప్పుడు బాధపడుతున్నట్లుగా, చీకటిఆలోచనలు
* ఆకలిగా లేనప్పుడు తినడం
* ఉత్సహాన్నికోల్పోవడం
* ప్రమాభరితంగా, వేగంగాడ్రైవింగ్ చేయ‌డం
* కుటుంబంలో, అనురాగాలు, ఆత్మీయతలు లోపించడం
ఒత్తిడి మన శరీరం
‘ స్ట్రెస్ని ‘ కలిగించే ఒకసంఘటనకాని, చర్యకాని జరిగినపుడు
మనశరీరంలోమార్పులుఏర్పడుతుంటాయి . శరీరంలోనినాడివ్యవస్థలోనిరెండుభాగాలుఈఒత్తిడివల్లప్రభావితమవుతుంటాయి.
1. సింపథిటిక్ నెర్వ‌స్ సిస్టం (సహానుభూతనాడివ్యవస్థ)::(sympathetic Nervous System) :
ప్రతినిత్యం ఎదురయ్యే సవాల్లను ఎదుర్కోవడంలోగాని, ప్రమాదాలు ఎదురైనప్పుడు ఈవ్యవస్థయాక్టివేట్అవుతుంది. దీనిని “Fight and Flight “ ” ఎదుర్కోలేదాపారిపో” స్తితిఅంటారు. సంఘటనకుసంబంధించినసమచారముమనమెదడుకుచేరివెంటనే ‘ పిట్యుటరిగ్రంధీ ఉత్తేజితమవుతుంది. ఫలితంగాకొన్నిలక్షణాలుకల్గుతాయి.
2. పారా సింప్త‌మేటిక్ నెర్వ‌స్ సిస్ట‌మ్‌‌: Para sympathetic nervous system ) ( పరసహానుభూతనాడివ్యవస్త )
మన శరీరం ఎప్పుడు ప్రశాంతంగా, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం. ధాతువుల పునర్నిర్మాణం వంటి చర్యలను ఈనాడి వ్యవస్త పర్యవేక్షిస్తుంది. ఇది తనకుతానుగ పనిచేయదు. మనం కావలసిన వ్యాయామం, పాజిటివ్లో ఆలోచనలతో ఉత్తేజింప చేయవచ్చు.

స్ట్రెస్ ల‌క్ష‌ణాలు:

1. శారీరకలక్షణాలు: ( Psychosomatic Consequences):
‘ Psyche ‘అంటేమైండ్ ‘ soma ‘ అంటేశరీరము. శరీరము,మనస్సులపైస్ట్రెస్ప్రత్యక్షంగాప్రభావంచూపిస్తుంది.
* తలనొప్పితరచుగా, తీవ్రంగావుండడం.
* తల, మెదడు, భుజాలు, కండరాలలోటెన్షన్, కన్నుఅదరడం
* జీర్నవ్యవస్థసరిగాపనిచెయకపోవడం, అల్సర్కిదారితీయడం
* మలబద్ధకం

* ఇవేకాకుండాCHD ( Coronary heart diseases )
గుండెదడ, హైపర్టెన్షన్, గాస్ట్రిక్ స‌మస్యలు, చర్మ సంబంధ వ్యాధులు వచ్చేఅవకాశం
* జుట్టురాలడం, ముఖంలో మార్పులు
ఉద్వేగ లక్షణాలు: ( Emotional Consequences )
* ఎప్పుడు చికాకుగా వుండడం, కోపాన్ని ప్రదర్శించడం
* నిరాశ, నిస్పృహ‌ల‌తో ఉండ‌టం
* ఆత్మవిశ్వాసం స‌న్న‌గిల్ల‌డం
* ఏమి తోచకుండా జీవితం అంధకారంగాభావించడం.
మానసికలక్షణాలు: ( Psychological consequences )
* మనిషినిమానసిక ప్ర‌తికూల‌త‌, ఏకాగ్రత లోపించడం
* మనసు రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడడం
* నెగెటివ్ఆ లోచనలు
* ఙ్ఞాపకశక్తి కోల్పోవడం, నిర్ణయాత్మక శక్తినికోల్పోవడం
* ఆంధోళ‌న, కుంగుబాటుకు గుర‌య్యే అవకాశం.
ఫ్రవర్తనా లక్షణాలు ( Behaviouralconsequencies)
* ప్రతిచిన్న విషయానికి ఆయాసపడడం
* ఎప్పుడు స్నేహితులతో, బంధువులతో, కుటుంబసభ్యులతోముభావంగావుండడం, ఎక్కువగాఇతరులమీదఆధారపడదం.
*అతినిద్ర లేదా నిద్రలేమి
* సిగరెట్లు, మద్యానికి అలవాటుపడడం
* లైంగికాసక్తి లోపించడం, ఫలితంగామరింత దిగులు.
* ప్రశాంతంగా వుండకపోవడం, స్థిరంగా ఒకచోట వుండకపోవడం
* ఆకలిలేమి, లావు పెరగడం/సన్నగా అయ్యేఅవకాశం

ఈ ఒత్తిడి మనల్నివేధించడానికి జీవనవిధానం కూడ ఒక ముఖ్యాంశం. అదేవిధంగా మనంతినే ఆహారంకూడ మనఆలోచనా విధానాన్ని మార్చివేస్తుంది. మనిషిజీవితంలో ‘ స్ట్రెస్ ‘ అనేది తప్పనిసరి. జీవితాన్నిమలుపు తిప్పుతుంది.

ఒత్తిడి లేకుండా ఒక నిర్ణ‌యం లేదు. సృజ‌నాత్మ‌క‌త కూడా రూపుదిద్దుకోలేదు. ఇక్క‌డ చేయాల్సింద‌ల్లా నెగిటివ్ నెస్ నుంచి త‌ప్పించుకోవ‌టం. ప్ర‌తికూ ఆలోచ‌న‌ల‌ను దూరం చేసుకునేందుకు అనుస‌రించాల్సిన మార్గాల‌ను అనుస‌రించ‌ట‌మే.

కొన్నిసూచనలు, అలవాట్లు మనజీవితాన్నిమార్చివేస్తాయి

‘’ స్ట్రెస్ ‘ నిఅధిగమించడం, మేనేజ్ చేయడం
* ఒత్తిడి కార‌కాల‌ను ముందుగానే ప‌సిగ‌ట్ట‌డం
* ప్రతిపనికి ఇతరుల్నినిందిచడం, త‌న దుర‌దృష్టానికి ఇత‌రుల‌ను భాగ‌స్థుల‌ను చేయ‌టం.
* అవసరమైనచో ఇతరుల సహాయము, సలహాలు, సూచనలు తీసుకోవడానికి మొహమాట పడకూడదు.

అవసరమైనవేళ Counsellor/Psychologistsసూచనలు తీసుకోవడం.
* ఆత్మవిశ్వాసం, సమయపాలన శిక్షణలుపొందడంద్వారా ఒత్తిడి అధిగమించే నైపుణ్యాలను పెంచుకోవడం.
* పాజిటివ్ఆలోచనలను పెంచుకోవడం
*’ స్ట్రెస్ ‘ సంఘటనలకు ప్రాధాన్యమివ్వకపోవడం.
* ప్రతిరోజుయోగా, వ్యాయామాలుచేయడంద్వారా త‌గ్గించుకోవ‌చ్చు.
* ఒకరు అనుకునే దానికంటే వ్యతిరేకంగా అనుభూతినిపొందడం.`
” ఒత్తిల్లు ‘ అనేవిజీవితంలోతప్పనిసరైనఒకభాగము.
కాబట్టి :
– వాస్తవజీవితంలోఒకభాగంగఅంగీకరించండం.
– ‘ స్ట్రెస్ ‘ మూలాల్నిఅర్థంచేసుకొవడానికి, మేనేజ్చేయడానికిప్రయత్నించడం.
– విజయాన్నిసాధించడంనేర్చుకోవాలి.

ఒత్తిడినిజయించడానికి 20 సూత్రాలు
1.మీ ఒత్తిడికి కారణాలేమిటోజాగ్రత్తగా కనుక్కోండి.
2.మీ ఒత్తిడికి మీప్రతిచర్యల్నిగమనించండి.
3. నెగిటివ్ నెస్‌ను తగ్గించడానికి మీజీవితంలో మార్గాల్నివెతకండి
4. ఎక్కువగా అలసిపోకుండావుండడం, మనం చెసేపనికితగ్గట్లుగా విశ్రాంతినిపొందడం.
5.ప్రతిరోజు వ్యాయ‌మం. యోగ, ప్రాణాయామం, ధ్యానం భాగం చేసుకోవాలి.
6. మీలక్ష్యసాధనకు, మీ అభివృద్ధికి ఒత్తిడిని సాధ‌న‌గా మ‌ల‌చుకోండి.
7. ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మందులు ఉపయోగించడం మానివేయండి.
8. మీ డబ్బు సంపాదన/ఖర్చుచేయడంలోతెలివిగావ్యవహరించండి.
9.ఇతరులపై నమ్మకాల్నివదిలివేయండి.
10. మంచినిద్రకు తగిన వాతావరణాన్నికల్పించుకోవడం.
11.. మనం చేసే పనిలోఏదైనా ఎక్కువగా burden అనిపించినట్లైతె ” కాదు”, ” నేనుచేయలేను” అనిచెప్పడానికి మొహమాటపడకండి.
12. మీనమ్మకస్తులైన స్నేహితులతోకాని, బంధువులతో కాని మీఒత్తిడి కారణాల్నినిర్మొహ‌మాటంగా చెప్ప‌టం ద్వారా ఈ స్ట్రెస్ ‘ తగ్గే అవకాశం ఉంది
13. ఆకాశానికి నిచ్చెనలు వేయడం మాని, వాస్తవాన్నిసాధ్యమైనవి మాత్రమే జీవితంలోఆశించడం.
14. బద్దకాన్నివదిలివేయండి. డైరీరాయడం అలవాటుగా మార్చుకోండి.
15. మీ అవసరాల్నితగ్గించుకోండి, సరళ‌మైనఆనందమయమైన జీవితాన్నిఅనుభవించడం నేర్చుకోండి.
16. ఈ రోజుకి ప్రాధాన్యతనివ్వండి. గతాన్నిఆలోచిస్తూ భవిష్యత్తు గురించి కలలు గ‌నడంమానండి.
17. ఒంటరితనాన్నిదూరంచేయండి. అందరితో కలివిడిగావుంటూ ఎప్పుడు నవ్వుతూజీవితాన్ని పదిలపరచుకోండి
18. ప‌రిస్థితుల‌ను శాస్త్రీయంగా, విశ్లేషణాత్మకంగా విశ్లేషించడానికి ప్రయత్నించండి.
19. మంచిఆహారాన్ని, ఆరోగ్యకరంగా తినే అలవాటును పెంపొందించుకోండి. ఎక్కువగాతినడం, జంక్‌ఫుడ్‌ను వ‌దిలేయండి
20. ఆత్మవిశ్వాసంతో, జీవితంపై నమ్మకాన్నిపెంపొందించుకొని ముందుకుసాగండి……. విజయంమీదే..

మాన‌సిక ఒత్తిడి- కొన్నిచేదునిజాలు
– ఒత్తిడి మూలంగా ఆత్మహత్యలకుగురవుతున్నవారిసంఖ్య 1.87 లక్షలు.
-75% మంది ప్రతి రెండువారాలకు ఒత్తిడితో అనారోగ్యం భారిన‌ప‌డుతున్నారు.
– 47% జనాభా నిద్రలేకుండా గడుపుతున్నారు.
– 34% తలనొప్పితో బాధపడుతున్నారు.
– 27% జీర్ణ కోశ ‌వ్యాధులతో బాధపడుతున్నారు.
– 28% మద్యానికి బానిస‌ల‌వుతున్నారు
– 16% పొగత్రాగడం అలవాటు చేసుకుంటున్నారు

డా.మోతుకూరి రాంచందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్.
( మనస్తత్వనిపుణులు)

9533660938

Previous articleకేటీఆర్ స్పూర్తికి హ్యాట్సాప్ !!
Next articleFlipkart Launches MarQ Android 9.0 Smart TV range for Indian Consumers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here