శ్రావణి సిల్వర్‌స్కీన్‌పై అందాల భామగా పేరుతెచ్చుకుంటున్న అమ్మాయి. జీవితాన్ని ఆస్వాదించాలనే ఉబలాటంలో వేసిన తప్పటుడుగులు. దీన్ని అవకాశంగా మలచుకున్న మగాళ్లు. ఫలితంగా.. బ్లాక్‌మెయిల్.. ఏ వీడియో తీసి భయపెట్టారో! ఇంకేం కావాలని డిమాండ్ చేశారో ఆ మృగాళ్లు. ఆడపిల్ల కదా! సున్నిత మనస్కురాలు.. భరించలేకపోయింది.. ఇప్పటి వరకూ అభిమానించిన వారిలో తనపై అసహ్యం కలుగుతుందని భయపడిపోయింది. తన అందాన్ని.. డబ్బును మాత్రమే చూసే మనుషుల మధ్య జీవితం వద్దనుకుని ఆత్మహత్య చేసుకుంది.. టీవీ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్యపై ఆమె స్నేహితులు చెబుతున్న మాటలు. ఈ నెల 8న ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులకు సవాల్‌గా మారింది.
గోదావరి జిల్లా వచ్చిన శ్రావణి కుటుంబం.. హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఐదారేళ్లుగా శ్రావణికి సీరియల్ నటిగా మంచిగుర్తింపు వచ్చింది. కొత్త పరిచయాలు జతకట్టాయి. అలా పరిచయమైన వ్యక్తి.. సాయి. అతడితో ఐదేళ్లపాటు కలసిమెలసి తిరిగింది. ఆ తరువాత ఏమైందో.. టిక్‌టాక్‌లో పరిచయమైన దేవరాజ్ రెడ్డి దోస్తీ.. ప్రేమ, పెళ్లి.. అంటూ దేవరాజ్ కూడా శ్రావణినా ఎమోషనల్ బ్లాక్హమెయిల్ చేశాడు. తాను అనాథనంటూ నాటకమాడాడు. చెల్లి కోసమే తాను బతుకుతున్నానంటూ సానుభూతి సంపాదించాడు. ఆమె డబ్బంతా వాడుకునేవాడు. ఆంక్షలతో కట్టడి చేసేవాడు. దేవరాజ్ వికృతమనసు తెలిసిన శ్రావణి దూరంగా నెట్టేసింది. అక్కడే అతడి అహం దెబ్బతిన్నది. తనకు డబ్బు, అందం రెండూ దూరం కావటాన్ని తట్టుకోలేకపోయాడు. అంతే.. తన వద్ద వున్న వీడియోలను బూచిగా చూపుతూ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆ వీడియోలో ఏమున్నదో కానీ.. శ్రావణి ఆత్మహత్య చేసుకుందంటూ.. సాయి అనే యువకుడు ఆరోపించాడు. దేవరాజ్‌రెడ్డి అనే వాడు.. కామరాజుగా పేరుబడ్డాడు. ప్లేబాయ్‌గా కేవలం అందమైన అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు. టిక్‌టాక్‌లో పరిచయమైన ఆడపిల్లలను ప్రేమపేరుతో వలవేసి అవసరాలు తీర్చుకునేవాడనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకూ 8 మంది యువతులు ప్లేబాయ్ చేతిలో మోసపోయారు. వీరిలో ముగ్గురు యువతులను పోలీసులు ప్రశ్నించారు.
అసలు జూన్ 22న శ్రావణి తనను వేధిస్తున్న దేవరాజ్‌రెడ్డిపై చర్యలు తీసుకోమంటూ పోలీసులకు పిర్యాదు చేసినపుడే యాక్షన్ తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదంటున్నారు సహనటులు. ఇక్కడే.. ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్‌రెడ్డి చక్రం తిప్పాడు.. దేవరాజ్‌రెడ్డి తరపున వకాల్తా పుచ్చుకుని రాజీ చేయాలని చూశాడు. అసలు అశోక్‌రెడ్డికి శ్రావణితో అంత చనువు ఎలా వచ్చింది? సాయి అనేవాడు నిజంగానే శ్రావణి ప్రేమికుడా? దేవరాజ్‌రెడ్డి అనే ప్రబుద్ధుడు.. శ్రావణిని ఏమని బ్లాక్‌మెయిల్ చేశాడు? ఈ ముగ్గురు మగాళ్లు.. శ్రావణి ఆత్మహత్య చేసుకునేంతగా టార్చర్ పెట్టటానికి కారణాలేమిటీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పోలీసులున్నారు.



