మెగాఫ్యామిలీ చుట్టూ ఎప్పుడూ ఏదో ఓక వివాదం సృష్టించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎక్కడ అవకాశం చిక్కినా అదిగో తోక అనేలోపుగానే ఇదిగో పులి అంటూ చెలరేగుతుంటారు. ప్రస్తుతం అదే తరహా ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. అదే మెగాస్టార్ చిరంజీవి రీమేక్‌కు సిద్ధమైన లూసిఫర్ నుంచి దర్శకుడు వి.వి.వినాయక్ తప్పుకున్నారనేది సారాంశం. నవంబరు 9,10 వ తేదీ నుంచి ఆచార్య షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు ఏడెనిమిది నెలలుగా కరోనాతో ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఒకానొక సందర్భంలో ఆ సినిమా ఆగిపోయిందని.. కొరటాల తప్పుకున్నారంటూ ఏవో పుకార్లు. పైగా.. కథ నాదేనంటూ వివాదం. దీంతో కథలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారట. వరుస సినిమాలతో చిరు దూసుకెళ్లేందుకు దాదాపు సిద్ధమయ్యారు. కరోనాతో జస్ట్ గ్యాప్ వచ్చిందనేది ప్యాన్స్ మాట. కానీ.. మళయాళంలో హిట్టయిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ తెలుగులో రీమేక్‌కు చిరంజీవి సిద్ధమయ్యారు. దానికి మొదట మెహర్‌రమేష్‌ను దర్శకుడుగా అనుకున్నారు. కానీ.. వినాయక్ అయితే బావుంటుందనే ఉద్దేశంతో చిరంజీవి మార్చారు.
కానీ.. కథలో మార్పులను చిరంజీవి చేశారట. అయితే అవి వినాయక్‌కు నచ్చకపోవటంతో సారీ.. అంటూ చిరంజీవికి చెప్పారనేది పుకార్ల సారాంశం. అసలు ఏం జరిగిందనేది. చిరంజీవి చెబితే తప్ప తెలియదన్నమాట. ఇప్పటికే అన్నయ్యతో ఠాగూర్, ఖైదీనెంబరు 150 హిట్లతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్న వినాయక్ ఈ నిర్ణయం తీసుకుంటరా అనేది మరో ప్రశ్న కూడా. ఎందుకంటే.. ఎంతోమంది దర్శకులు చిరు రీ ఎంట్రీ సినిమాకు కథతో రెఢీగా ఉన్నా.. మెగాస్టార్ మాత్రం వినాయక్‌కు అవకాశం ఇవ్వటం ఇద్దరి మధ్య ఎంతట కెమిస్ట్రీ ఉందనేందుకు నిదర్శనం. అటువంటిది.. లూసిఫర్ రీమేక్ నుంచి తప్పుకోవటం అనేది కూడా పుకార్లు కావచ్చంటూ చిరు ఫ్యాన్స్ భావిస్తున్నారు.