కొన్ని వింటే.. ఔనా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం.. ఒప్పుకోవాల్సిందే. అటువంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆ కుర్రాడు బిహార్ నుంచి వచ్చాడు.. ఆ కుర్రదేమో యూపీ నుంచి చేరింది. ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేస్తుండటంతో మొదట కళ్లు కలిశాయి. ఆ తరువాత మనసులు.. ఇంకెందుకు ఆలస్యం. అంటూ ఏకంగా ఒకే ఇంట్లో కొత్త జీవితం ప్రారంభించారు. ఇదెలా సాధ్యమంటారా! కోర్టుల తీర్పుల పుణ్యమాంటూ.. ఇద్దరు ఆడ, మగ కలసి ఉండటం.. అది కూడా సమ్మతితో తప్పేం కాదంటూ చెబితిరి. దీన్నే ఇప్పుడు తెలుగులో అయితే సహజీవనం.. ఇంగ్లిషులో డేటింగ్ అంటున్నారు. కాసేపు.. వివరణలు పక్కనబెడితే.. ఆ ఇద్దరూ ఎంచక్కా చిలకా గోరింకల్లా బాగానే గడుపుతున్నారట. కానీ.. ఇంతలో ఏమైందో.. ఒకరోజు ఆ కుర్రది.. హఠాత్తుగా పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చింది. కుర్రాడు మీద ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ.. ఆమె బాధ ఏమిటని.. ఫిర్యాదు చదివిన పోలీసుకూ మొదట షాక్ కొట్టినంత పనైందట. దానిలో రాసిన ఫిర్యాదు ఏమిటంటే.. రోజూ ఇద్దరూ ఇష్టానుసారం శృంగారంలో పాల్గొనేవారట. కానీ ఆ ముందు రోజు అతగాడు.. కండోమ్ వాడకుండా ఆమెపై లైంగిక ఒత్తిడి తెచ్చాడట. అంతే.. అమ్మా.. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఫోర్స్ చేస్తావా! అంటూ కోపగించిన అమ్మడు.. ఎంచక్కా పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతగాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఆ తరువాత బతుకుజీవుడా అనుకుంటూ బెయిల్ తీసుకుని సొంతూరు వెళ్లిపోయాడట. ఇంతకీ.. ఇదెక్కడ జరిగిందని మాత్రం అడగొద్దు..! ఎందుకంటే.. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఒకసారి జరిగిన సంఘటన అంటూ ఓ రిటైర్డ్ పోలీసు అధికారి చెబితే తెలిసిందన్నమాట.