ఆ త‌హ‌సీల్దార్ ఆస్తి రూ.150కోట్లు!

రెవెన్యూ ఉద్యోగం వ‌స్తే చాలు.. కోట్లు కూడ‌బెట్ట‌డం చాలా ఈజీ. త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో అటెండ‌ర్‌గా చేరినా త‌రాల‌కు స‌రిప‌డ కూడ‌బెట్ట‌వచ్చు. ఇది నిజ‌మే.. రెవెన్యూలో అవినీతి ఎంత‌గా పెరిగింద‌నేందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. గ‌తేడాది అబ్దుల్లాపూర్ త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డిని ఓ రైతు పెట్రోల్ పోసి నిప్పంటించి చంప‌టం సంచ‌ల‌నం రేకెత్తింది. షేక్‌పేట్ త‌హ‌సీల్దార్ సుజాత, ఆర్ ఐ నాగార్జున‌రెడ్డి ఏకంగా రూ.50ల‌క్ష‌లు తీసుకుంటూ ఏసీబీకు ప‌ట్టుబ‌డ్డారు. తాజాగా కీస‌ర త‌హ‌సీల్దార్ నాగ‌రాజ్ ఏకంగా రూ.2కోట్ల కొల్ల‌గొట్టాల‌ని చూశాడు. దానిలో రూ.1.10కోట్లు లంచంగా తీసుకుంటూ ఏసీబీకు ప‌ట్టుబ‌డ్డాడు. స‌ద‌రు నాగ‌రాజ్ ఎలాంటోడంటే.. ఒక రిటైర్డ్ ఎస్పీ వ‌ద్ద‌నే బేరం పెట్టాడు. తాను అడిగినంత ఇవ్వ‌కుండా ప‌ట్టాలు ఇవ్వ‌నంటూ బెదిరించాడు కూడా.. చిన్న ఉద్యోగిగా మొద‌లైన ఇత‌గాడు.. త‌హ‌సీల్దార్ అయ్యేనాటికి ఎంత కూడ‌బెట్టాడో తెలుసా.. అక్ష‌రాలా రూ.150 కోట్లు. పైగా భూములు వివ‌దాల‌ను అవ‌కాశం చేసుకుని ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేసేవాడ‌ట‌. ఈయ‌న గారి వెనుక ఒక రాజ‌కీయ‌పార్టీకు చెందిన ఎంపీగారు ఉన్న‌ట్టుగా ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రి.. ఆ ఎంపీ ఎంత తిన్నాడో.. త‌హ‌సీల్దార్‌కు ఇంకెంత మంది బినామీలున్నార‌నే దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నార‌ట‌.

1 COMMENT

  1. ఇది తేలిన లెక్క, తేలనివి ఎన్ని..అటెండర్ గా చేరి ఆర్.ఐ స్థాయికి వచ్చిన వ్యక్తి 13 ఏళ్లలో, 1996 లొనే కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే…దాని గృహప్రవేశానికి పై అధికారులు కూడా వచ్చారు….రెవిన్యూ, రెజిస్ట్రేషన్ శాఖ, ట్రెజరీ, గనులు, పోలీస్ , అటవీ ఇలా కొన్ని శాఖలు వసూళ్ళలో ముందంజలో ఉంటే కొన్ని వెనుకబడ్డాయి….

Leave a Reply to పి.వి.రావు Cancel reply

Please enter your comment!
Please enter your name here